బాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో విడుదలవుతోన్న సినిమాలన్నీ డిజాస్టర్స్ అవుతున్నాయి. ఇదే సమయంలో సౌత్ సినిమాలు నార్త్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. దీంతో యాడ్ మార్కెట్ దృష్టి కూడా సౌత్ స్టార్స్ పై పడుతోంది. ఎవరు ట్రెండింగ్ లో ఉన్న వారినే బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకోవడానికి కంపెనీలు మొగ్గు చూపుతాయనేది తెలిసిందే. ఈ క్రమంలో కార్పొరేట్ వ్యాపార సంస్థల చూపు సౌత్ స్టార్స్ పై పడింది. అల్లు అర్జున్, రష్మిక, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ..
ఇలా కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటున్న వారిలో సౌత్ స్టార్స్ పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ తో అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసుకొని మరీ కొన్ని కంపెనీలు ఇటువైపు మొగ్గు చూపుతున్నాయి. ఇలా యాడ్స్ విషయంలో కూడా సౌత్ స్టార్లు.. బాలీవుడ్ వారిని డామినేట్ చేస్తున్నారు. ఇదివరకు కూడా సౌత్ స్టార్స్ ను బ్రాండ్ అంబాసిడర్లుగా తీసుకొని పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోట్ చేసుకున్నారు. మహేష్ బాబుతో కొన్ని యాడ్స్ ను చేయించి వాటిని ఇండియా వ్యాప్తంగా ప్రసారం చేశాయి కొన్ని సంస్థలు.
మాములుగా అయితే అంతకముందు తెలుగు స్టార్లు చేసే యాడ్స్ ఇక్కడివరకే పరిమితమయ్యేవి. హిందీ, తమిళం, కన్నడ ఇలా ఎక్కడికక్కడే వేరే వాళ్లతో యాడ్స్ చేయించేవారు. మహేష్ తరువాత ప్రభాస్ యాడ్ మార్కెట్ లో హవా చూపించారు. ఇప్పుడు అల్లు అర్జున్, రష్మిక, రామ్ చరణ్ ల వంతు వచ్చింది. అల్లు అర్జున్ చేతిలో ఇప్పటికే అరడజనుకి పైగా బ్రాండ్స్ ఉన్నాయి. రష్మికకు కూడా యాడ్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. రామ్ చరణ్ కూడా తన రేంజ్ లో ఒప్పందాలు చేసుకుంటున్నారు.