తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అందరినీ ఊరిస్తున్న సినిమాల్లో మహేష్ స్పైడర్ నంబర్ వన్ స్థానంలో ఉంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్నీ సొంతం చేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు క్యూ కడుతున్నారు. నైజాం ఏరియా థియేటర్స్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. ఇందుకోసం 25 కోట్లు చెల్లించారని సమాచారం. ఈ రేట్ చూసి అందరూ షాక్ తింటున్నారు. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన శ్రీమంతుడు నైజాంలో 20 కోట్లు వసూలు చేసింది. ఆ మొత్తంకంటే మరో ఐదు అదనంగా పెట్టి స్పైడర్ కొనడాన్ని సాహసంగా చెప్పుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా తమిళనాడు థియేటర్స్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలిసింది.
బాహుబలి కంక్లూజన్ కంటే ఎక్కువ చెల్లించి అక్కడి డిస్ట్రిబ్యూటర్లు స్పైడర్ థియేటర్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. బాహుబలి 2 డబ్బింగ్ మూవీ, స్పైడర్ స్ట్రైట్ మూవీ. అంతేకాదు మురుగదాస్ కి తమిళనాడులో మంచి క్రేజ్ ఉంది. సో ఈ భారీ డీల్ సెట్ అయినట్లు కోలీవుడ్ వర్గాలవారు చెప్పారు. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27 న రిలీజ్ కాబోతోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.