రేపటి నుంచి స్పైడర్ లాస్ట్ షెడ్యూల్
- May 12, 2017 / 09:46 AM ISTByFilmy Focus
తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగ దాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్పైడర్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కొన్నిరోజుల క్రితం హైదరాబాద్ లోని యూసఫ్ గూడాలోని పోలీస్ క్వార్ట్రర్స్ లో ఆఖరి షెడ్యూల్ మొదలైన సంగతి తెలిసిందే. అక్కడ కొంత యాక్షన్ దృశ్యాలను తెరకెక్కించిన చిత్ర బృందం రామోజీఫిల్మ్ సిటీలో కూడా కొంత పార్ట్ షూట్ చేశారు. రెండు రోజుల క్రితం ఈ షూట్ కి బ్రేక్ ఇచ్చి మహేష్ తన భార్య పిల్లలతో కలిసి గోవా టూర్ కి వెళ్లారు. ఈ రోజుతో ఆయన టూర్ ముగించుకొని హైదరాబాద్ కి రానున్నారు. రేపటి నుంచి చివరి షెడ్యూల్ లో పాల్గొననున్నారు.
మిగిలిన యాక్షన్ పార్ట్ తో పాటు ఒక సాంగ్ ని కూడా రామోజీ ఫిలిం సిటీలో కంప్లీట్ చేయనున్నట్లు తెలిసింది. మహేష్ పక్కన ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఆడి పాడనున్న ఈ చిత్రంలో విలన్ గా డైరక్టర్, నటుడు ఎస్.జె.సూర్య నటిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ ని సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు (మే 31)న రిలీజ్ చేయనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















