‘రాజావారు రాణిగారు’ చిత్రంతో తన యాక్టింగ్ స్కిల్స్ ఏంటో చూపించి యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు హీరో కిరణ్ అబ్బవరం. ఈ నేపథ్యంలో అతని రెండో సినిమా అయిన ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన వెంటనే అందరి దృష్టి ఈ సినిమా పై పడింది.’ఆర్.ఎక్స్.100′ ఫేమ్ చేతన్ సంగీతంలో రూపొందిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి.దాంతో ఈ సినిమా పై ఉన్న అంచనాలు డబుల్ అయ్యాయి అనే చెప్పాలి. హీరోయిన్ ప్రియాంకా జవల్కర్ లుక్స్, టీజర్, ట్రైలర్ వంటివి కూడా హిట్ అవ్వడంతో ఈ సినిమా సూర్ షాట్ హిట్ అని ప్రేక్షకులు భావించారు.మరి వారి అంచనాలను ఈ సినిమా ఎంత వరకు మ్యాచ్ చేసిందో తెలుసుకుందాం రండి.
కళ్యాణ్ (హీరో కిరణ్ అబ్బవరం) ఒకప్పుడు బాగా బ్రతికి తర్వాత ఆర్ధికంగా నష్టపోయిన ధర్మ (సాయికుమార్) కొడుకు. హీరో తాత గారు ఎస్.ఆర్.కళ్యాణమండపం ను స్థాపించి బాగా సంపాదించి పోతారు.కానీ ధర్మ… తన తండ్రి ఆస్తిని సాయం అంటూ బాధపడుతున్న వాళ్లకు దానాలు చేసేసి చివరికి ఆ కళ్యాణమండపాన్ని కూడా తాకట్టు పెట్టే స్థాయికి వచ్చేస్తాడు.ఈ కారణాలతో హీరోకి అలాగే అతని తండ్రికి అస్సలు పడదు.ధర్మ భార్య కూడా అతన్ని చిన్న చూపు చూస్తుంటుంది.మరోపక్క హీరోయిన్ సింధు (ప్రియాంకా జవాల్కర్)తో ప్రేమలో పడతాడు హీరో.
వీళ్ళ లవ్ ట్రాక్ తెలిసిన హీరోయిన్ తండ్రి కళ్యాణ్ ను ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. తర్వాత హీరో తిరగబడతాడు. ఓ పక్క తన ఎస్.ఆర్.కళ్యాణ మండపాన్ని.. మరోపక్క తన ప్రేమని హీరో ఎలా కాపాడుకున్నాడు అనేది తెర పై చూడాల్సిన కథ.
నటీనటుల పనితీరు: కిరణ్ అబ్బవరం తన ట్యాలెంట్ మొత్తం ఈ సినిమాలో చూపించాలని తెగ ప్రయత్నించాడు. ప్రతీ ఫ్రేమ్ లో అతని కష్టం కనిపిస్తుంది.యాక్షన్ సీన్స్ లో కూడా అలరించాడు. హావభావాలు కూడా బాగానే పలికించాడు. కానీ అతని డైలాగ్ డెలివరీ అంత ఆకర్షించే విధంగా లేదు. ఇక హీరో తర్వాత ఆ స్థాయి పాత్ర సాయి కుమార్ కే పడింది. ఎంతో అలవోకగా ఆ పాత్రని పోషించాడు. ఈ మూవీకి గాను అతను ప్రశంసలు అందుకోవడం గ్యారెంటీ. హీరో ఫ్రెండ్స్ గా నటించిన కూడా ఓకే అనిపించారు.
ఇక హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్ విషయానికి వస్తే ఇందులో ఆమె కొంచెం బొద్దుగా కనిపించింది. తెర మీద ఆమె హీరోయిన్ కంటే పెద్ద వయసు కలిగిన అమ్మాయిలా కనిపిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.లుక్స్ మాత్రమే కాదు.. ఈమె పాత్రని కూడా సరిగ్గా డిజైన్ చేసినట్టుగా అనిపించదు. నటి తులసి మాత్రం తన మార్క్ నటనతో ఆకట్టుకుంది.
సాంకేతికవర్గం పనితీరు: ఈ లిస్ట్ లో వందకి వంద మార్కులు వేయాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ కే.! ఫస్ట్ లాక్ డౌన్ నుండీ రెండు పాటలు తెగ హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాటలు స్క్రీన్ పై కూడా బాగున్నాయి.నేపధ్య సంగీతం కూడా బాగుంది. విశ్వాస్ డేనియల్ అందించిన సినిమాటో గ్రఫీ బాగానే ఉంది. ఎడిటింగ్ లోపాలు ఉన్నాయి.దర్శకుడు శ్రీధర్ గాదెనే ఎడిటర్ అన్న సంగతి తెలిసిందే. ఈ రెండు విషయాల్లోనూ చాలా తప్పులు జరిగాయి.ఫస్ట్ హాఫ్ లో ఏ సీన్ జరిగినా వెంటనే వైన్ షాప్ లో నెక్స్ట్ సీన్ ఓపెన్ అవ్వడం ప్రేక్షకులను బాగా ఇబ్బంది విసిగించిందనే చెప్పాలి.
ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదు. ఎంటర్టైన్మెంట్ తో కాలక్షేపం చేసేయొచ్చు. కానీ సెకండ్ హాఫ్ విషయంలో దర్శకుడు శ్రద్ధ పెట్టుంటే బాగుండేది. హీరోకి అతని తండ్రికి మధ్య వచ్చే సన్నివేశాలను బాగా రాసుకున్న దర్శకుడు.. మిగిలిన భాగాన్ని హడావిడి హడావిడిగా తెవిల్చేశాడనిపిస్తుంది.
విశ్లేషణ: ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ మూవీ పై మొదటి నుండీ మంచి అంచనాలు ఉన్నాయి. కానీ వాటిని పూర్తిస్థాయిలో అయితే ఈ చిత్రం అందుకోలేదని చెప్పాలి. ఫస్ట్ హాఫ్, రెండు పాటలు, కిరణ్- సాయి కుమార్ ల మధ్య వచ్చే ఎమోషనల్ ట్రాక్ మెప్పిస్తుంది. రెస్ట్ అంతా లైట్ అనే ఫీలింగ్ కలిగిస్తుంది.పనిగట్టుకుని థియేటర్ కు వెళ్లి చూడాల్సిన మూవీ అయితే కాదు.. ఓటిటిలో అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత థియేటర్లకు వచ్చిన క్రేజీ మూవీ కాబట్టి.. మంచి ఓపెనింగ్స్ అయితే నమోదయ్యే అవకాశం ఉంది.