రామ్ పెదనాన్న, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ , ‘శ్రీ స్రవంతి మూవీస్ అధినేత’ అయిన ‘స్రవంతి’ రవికిశోర్ అందరికీ సుపరిచితమే. ఆయన మొదటిసారి ‘కిడ’ అనే తమిళ చిత్రాన్ని రూపొందించారు. అదే ‘దీపావళి’ పేరుతో తెలుగు నవంబర్ 11 న విడుదల కానుంది. కృష్ణ చైతన్య ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఆర్ఏ వెంకట్ దర్శకుడు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ‘స్రవంతి’ రవికిశోర్ మీడియాతో ముచ్చటించారు.
ఇది ‘బలగం’ రేంజ్ సక్సెస్ అవుతుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇది పక్కన పెట్టేస్తే.. త్రివిక్రమ్ – రవికిశోర్ లకి మంచి అనుబంధం ఉంది. గతంలో ‘నువ్వేకావాలి’ ‘నువ్వు నాకు నచ్చావ్’ ‘నువ్వే నువ్వే’ వంటి చిత్రాలను రవి కిషోర్ నిర్మించగా వాటికి త్రివిక్రమ్ రైటర్ గా వ్యవహరించడం జరిగింది. దీంతో త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తర్వాత రామ్ తో ఓ సినిమా చేయమని రవికిశోర్ అడగడం జరిగింది. ఈ ప్రాజెక్టు ఉంటుంది అని గతంలో కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇంకా ఈ ప్రాజెక్టు సెట్ అవ్వలేదు.
ఈ విషయం పై రవికిశోర్ కి ఓ ప్రశ్న ఎదురైంది.’ మీరు, త్రివిక్రమ్ (Trivikram) మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తారు? రామ్ ని హీరోగా పెట్టి సినిమా చేస్తారా?’ అని ప్రశ్నించగా.. “రామ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని నాకు కూడా ఉంది. కానీ ముందు త్రివిక్రమ్ తన కమిట్మెంట్స్ ఏం ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసుకోవాలి.తర్వాత రామ్ తో చేస్తేనే.. నా డ్రీం ఫుల్ ఫిల్ అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు.