యాంకర్ శ్రీముఖి పరిచయం అవసరం లేని పేరు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. వాటితో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక యాంకర్ గా మారింది. ఈమె చేసిన షోలలో ‘పటాస్’ బాగా క్లిక్ అయ్యింది. ఆ షోలో ఈమె ఎనర్జీతో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. ఆ షో లో యాంకర్ రవితో ఈమె చేసిన సందడి ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేనిది. ఏదేమైనా ఆ షో శ్రీముఖి కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.
అటు తర్వాత ‘జూ లక టక’ వంటి షోలతో ఈమె ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది. ఇక బిగ్ బాస్ సీజన్ 3 లో రన్నర్ గా నిలిచి తన ఇమేజ్ ను మరింతగా పెంచుకుంది. ప్రస్తుతం ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క సైమా వంటి అవార్డు ఫంక్షన్లను హోస్ట్ చేస్తుంది. అంతేకాదు ఓంకార్ హోస్ట్ చేస్తున్న డాన్స్ ఐకాన్ లో కూడా ఈమె పాల్గొంటుంది. ఇక సోషల్ మీడియాలో ఈమె హవా ఎలా ఉంటుందో తెలిసిందే.
హీరోయిన్స్ ని ఏమాత్రం తీసిపోని విధంగా ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి ఏకంగా 4.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే సోషల్ మీడియాలో కొత్త కొత్త ఫొటోలతో అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈమె పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి. ఇందులో థైస్ అందాలతో, క్లీవేజ్ అందాలతో అమితంగా ఆకట్టుకుంటుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :