Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » విజయ్ సేతుపతి-జయరామ్ హీరోలుగా నటించిన ‘రేడియో మాధవ్’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు!

విజయ్ సేతుపతి-జయరామ్ హీరోలుగా నటించిన ‘రేడియో మాధవ్’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు!

  • October 8, 2020 / 01:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ సేతుపతి-జయరామ్ హీరోలుగా నటించిన ‘రేడియో మాధవ్’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు!

విజయ్ సేతుపతి, జయరామ్ హీరోలుగా నటించిన మలయాళ సినిమా ‘మార్కొని మతాయ్’. సనల్ కలతిల్ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా అక్కడ మంచి విజయం సాధించింది. అతి తక్కువ సమయంలో తమిళంలో కథానాయకుడిగా, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి మలయాళంలో నటించిన తొలి చిత్రమిది. తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘రేడియో మాధవ్’గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు లక్ష్మీ చెన్నకేశవ ఫిలిమ్స్ అధినేత, నిర్మాత కృష్ణస్వామి. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఫస్ట్ లుక్ ను బుధవారం హీరో శ్రీవిష్ణు విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ “విజయ్ సేతుపతిగారు నటించిన ‘రేడియో మాధవ్’ తెలుగులో అనువాదం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.

నిర్మాత కృష్ణస్వామి మాట్లాడుతూ “మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన శ్రీవిష్ణుగారికి చాలా చాలా స్పెషల్ థాంక్స్. మా సంస్థ రెండో చిత్రమిది. ఇంతకు ముందు దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి నటించిన ‘హే పిల్లగాడ’ విడుదల చేశా. ఇప్పుడు ‘రేడియో మాధవ్’ తీసుకొస్తున్నాను. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా కనిపిస్తారు. తన నిజ జీవిత పాత్రలో ఆయన నటించారు. భాగమతి, అల వైకుంఠపురం చిత్రాలలో విలన్ గా తండ్రిగా నటించిన జయరామ్ ఈ చిత్రంలో మిలటరీ నుంచి బయటకి వచ్చి బ్యాంకు సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ ఉండే పాత్ర పోషించాడు. ఎఫ్.ఎం. రేడియో స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ప్రేమకథ ఈ ‘రేడియో మాధవ్’ సినిమా” అని అన్నారు.

సహ నిర్మాత చలం మాట్లాడుతూ “కేరళ పచ్చటి అందాల మధ్య ఉన్న చంగనసేరి అనే చిన్న పట్టణంలో నడిచే చక్కటి సినిమా ‘రేడియో మాధవ్’. ఇందులో పాటలు చాల బాగుంటాయి. థియేటర్లలో పరిస్థితిని బట్టి విడుదలపై నిర్ణయం తీసుకుంటాం” అని చెప్పారు.

చిత్ర నిర్వాహకుడు శ్రీనివాస మూర్తి మాట్లాడుతూ “రేడియో మాధవ్’ ఒక ఫీల్ గుడ్ సినిమా. హీరో హీరోయిన్లు ఎప్పుడు కలుస్తారా? అని ప్రేక్షకులు ఎదురు చూసేలా ఉంటుంది” అని అన్నారు.

తెలుగులో మాటలు, పాటలు రాసిన భాష్య శ్రీ మాట్లాడుతూ “తెలుగులో వెంకటేష్ గారు నటించిన ‘రాజా’, ‘సంక్రాంతి’ తరహా మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఇది. మలయాళంలో పెద్ద విజయం సాధించింది. తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఎంజాయ్ చేస్తూ చేసిన డబ్బింగ్ సినిమా ఇది” అని అన్నారు.

విజయ్ సేతుపతి, జయరామ్, ఆత్మీయ రాజన్, పూర్ణ, నరేన్, అజూ వర్గీస్ తదితరులు సినిమాలో నటించారు. ఈ చిత్రానికి సమర్పణ: గుండేపూడి శీను, మాటలు & పాటలు : భాష్య శ్రీ, ఎడిటింగ్‌: షామీర్ ముహమ్మెద్, కెమెరా: సజన్ కలతిల్, సంగీతం: ఏం. జయచంద్రన్, పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు-ఫణి కందుకూరి (Beyond Media), ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎన్. శ్రీనివాస మూర్తి, సహ- నిర్మాత: డి.వి . చలం, నిర్మాత: డి.వి . కృష్ణస్వామి, కధ-దర్శకత్వం: సనల్ కలతిల్

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jayaram
  • #Radio Madhav
  • #Sree Vishnu
  • #Vijay SethuPathy

Also Read

Varanasi Movie: 512 CE టు 2027 CE వయా 7200 BCE త్రేతాయుగం!

Varanasi Movie: 512 CE టు 2027 CE వయా 7200 BCE త్రేతాయుగం!

Varanasi Movie: రాజమౌళి- మహేష్..ల ‘వారణాసి’ వెనుక ప్రభాస్ హస్తం.. ఆసక్తికర విషయం చెప్పుకొచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi Movie: రాజమౌళి- మహేష్..ల ‘వారణాసి’ వెనుక ప్రభాస్ హస్తం.. ఆసక్తికర విషయం చెప్పుకొచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్

Rajamouli: మహేష్ బాబుని రాముడిగా చూస్తే గూజ్ బంప్స్ వచ్చాయి.. అతని నుండి అందరూ నేర్చుకోవాల్సిన గుణం అదే: రాజమౌళి

Rajamouli: మహేష్ బాబుని రాముడిగా చూస్తే గూజ్ బంప్స్ వచ్చాయి.. అతని నుండి అందరూ నేర్చుకోవాల్సిన గుణం అదే: రాజమౌళి

Varanasi Movie: మా నాన్న చెప్పిన ఆ మాట నేను వినేవాడిని కాదు.. నా దర్శకుడు రాజమౌళి గర్వపడేలా ‘వారణాసి’ కోసం కష్టపడతాను: మహేష్ బాబు

Varanasi Movie: మా నాన్న చెప్పిన ఆ మాట నేను వినేవాడిని కాదు.. నా దర్శకుడు రాజమౌళి గర్వపడేలా ‘వారణాసి’ కోసం కష్టపడతాను: మహేష్ బాబు

Varanasi: ‘వారణాసి’ ఫిక్స్.. జక్కన్న నెవ్వర్ బిఫోర్ అడ్వెంచర్ ఇదే!

Varanasi: ‘వారణాసి’ ఫిక్స్.. జక్కన్న నెవ్వర్ బిఫోర్ అడ్వెంచర్ ఇదే!

SSMB29: 2027 లోనే గృహప్రవేశం.. మెలోడీ నాదే..బీటు నాదే: కీరవాణి

SSMB29: 2027 లోనే గృహప్రవేశం.. మెలోడీ నాదే..బీటు నాదే: కీరవాణి

related news

Sree Vishnu: శ్రీవిష్ణుకి ఇంత పెద్ద కూతురు ఉందా.. ఎంత క్యూట్ గా ఉందో చూడండి

Sree Vishnu: శ్రీవిష్ణుకి ఇంత పెద్ద కూతురు ఉందా.. ఎంత క్యూట్ గా ఉందో చూడండి

trending news

Varanasi Movie: 512 CE టు 2027 CE వయా 7200 BCE త్రేతాయుగం!

Varanasi Movie: 512 CE టు 2027 CE వయా 7200 BCE త్రేతాయుగం!

14 hours ago
Varanasi Movie: రాజమౌళి- మహేష్..ల ‘వారణాసి’ వెనుక ప్రభాస్ హస్తం.. ఆసక్తికర విషయం చెప్పుకొచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi Movie: రాజమౌళి- మహేష్..ల ‘వారణాసి’ వెనుక ప్రభాస్ హస్తం.. ఆసక్తికర విషయం చెప్పుకొచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్

15 hours ago
Rajamouli: మహేష్ బాబుని రాముడిగా చూస్తే గూజ్ బంప్స్ వచ్చాయి.. అతని నుండి అందరూ నేర్చుకోవాల్సిన గుణం అదే: రాజమౌళి

Rajamouli: మహేష్ బాబుని రాముడిగా చూస్తే గూజ్ బంప్స్ వచ్చాయి.. అతని నుండి అందరూ నేర్చుకోవాల్సిన గుణం అదే: రాజమౌళి

15 hours ago
Varanasi Movie: మా నాన్న చెప్పిన ఆ మాట నేను వినేవాడిని కాదు.. నా దర్శకుడు రాజమౌళి గర్వపడేలా ‘వారణాసి’ కోసం కష్టపడతాను: మహేష్ బాబు

Varanasi Movie: మా నాన్న చెప్పిన ఆ మాట నేను వినేవాడిని కాదు.. నా దర్శకుడు రాజమౌళి గర్వపడేలా ‘వారణాసి’ కోసం కష్టపడతాను: మహేష్ బాబు

15 hours ago
Varanasi: ‘వారణాసి’ ఫిక్స్.. జక్కన్న నెవ్వర్ బిఫోర్ అడ్వెంచర్ ఇదే!

Varanasi: ‘వారణాసి’ ఫిక్స్.. జక్కన్న నెవ్వర్ బిఫోర్ అడ్వెంచర్ ఇదే!

16 hours ago

latest news

IBOMMA: జైలుకు ‘ఐబొమ్మ’ రవి.. అతని టాలెంట్ కు పోలీసులే షాక్!

IBOMMA: జైలుకు ‘ఐబొమ్మ’ రవి.. అతని టాలెంట్ కు పోలీసులే షాక్!

36 mins ago
VARANASI ఈవెంట్: దేవుడిని నమ్మనప్పుడు.. హనుమంతుడిని బ్లేమ్ చేయడమేంటి?

VARANASI ఈవెంట్: దేవుడిని నమ్మనప్పుడు.. హనుమంతుడిని బ్లేమ్ చేయడమేంటి?

57 mins ago
VARANASI ఈవెంట్.. నమ్మినోడే సగం దెబ్బేశాడు

VARANASI ఈవెంట్.. నమ్మినోడే సగం దెబ్బేశాడు

1 hour ago
Mahesh Babu: మహేష్ బాబు నిర్మాతల హీరో.. రాజమౌళి 15 ఏళ్ళ క్రితం ఎలా ఉన్నారో.. ఇప్పటికీ అలానే ఉన్నారు: నిర్మాత కే.ఎల్.నారాయణ

Mahesh Babu: మహేష్ బాబు నిర్మాతల హీరో.. రాజమౌళి 15 ఏళ్ళ క్రితం ఎలా ఉన్నారో.. ఇప్పటికీ అలానే ఉన్నారు: నిర్మాత కే.ఎల్.నారాయణ

15 hours ago
SSMB29: 30 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్.. మహేష్ బాబు విశ్వరూపం చూస్తూ అలా ఉండిపోయాను: విజయేంద్రప్రసాద్

SSMB29: 30 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్.. మహేష్ బాబు విశ్వరూపం చూస్తూ అలా ఉండిపోయాను: విజయేంద్రప్రసాద్

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version