‘ఒక హీరో తన కొడుకుని హీరోని చేస్తున్నాడు.. ఒక డాక్టర్ తన కొడుకుని డాక్టర్ ను చేస్తున్నాడు.. ఒక ఇంజినీర్ తన కొడుకుని ఇంజినీర్ ను చేస్తున్నాడు.. కానీ ఒక రైతు మాత్రం తన కొడుకుని రైతు చేయాలనుకోవడం లేదు.. ఈ ఒక్కటి నాకు అర్ధంకానీ ప్రశ్న గా మిగిలిపోయింది’ అనే ఇంట్రెస్టింగ్ డైలాగ్ తో ‘శ్రీకారం’ టీజర్ మొదలైంది. టీజర్ ప్రారంభం నుండీ ‘శతమానం భవతి’ మరియు ‘మహర్షి’ చిత్రాలను గుర్తుచేసే విధంగానే ఉంది ఈ టీజర్.
నిజానికి అవి కూడా అరడజను సినిమాలను మిక్సీలో వేసి జ్యూస్ తీసినవే అనుకోండి..! సరే ఆ ఛాయలను పట్టించుకోకుండా ఉంటే.. ‘శ్రీకారం’ టీజర్ బాగానే ఉంది. రైతులకు ఉద్యోగాలు ఇచ్చి.. వారికి జీతాలను ఇవ్వడమే ఈ చిత్రం కథాంశం అని స్పష్టమవుతుంది. ‘శ్రీకారం’ అనే షార్ట్ ఫిలింను కాస్త ఎక్స్టెండ్ చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ఉన్నాడు దర్శకుడు. ఓవరాల్ గా టీజర్ చూస్తుంటే శర్వానంద్ కంబ్యాక్ ఇచ్చేలానే ఉన్నాడు.
కాకపోతే ఇలాంటి లైన్ తో సినిమా తీసినప్పుడు ఏ సంక్రాంతికో రిలీజ్ ప్లాన్ చేసుకుని ఉంటే ఇంకా బాగుండేది. కానీ కుదరక ఈ చిత్రాన్ని మార్చి 11న శివరాత్రి కానుకగా విడుదల చేస్తున్నారు. ఇక కిషోర్.బి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ’14 రీల్స్ ప్లస్’ బ్యానర్ పై రామ్ ఆచంట,గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతంలో రూపొందిన ‘వస్తానంటివో పోతానంటివో’ పాట ఇప్పటికే ఈ చిత్రం పై అంచనాలను పెంచేసిందనే చెప్పాలి.
వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!