సినిమా ఇండస్ట్రీలో తాటికాయంత టాలెంట్‌తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటుంటారు.. మరి యంగ్ బ్యూటీ శ్రీలీలకి ఆ అదృష్టం ఆవకాయంతో, ఆనపకాయంతో ఉన్నట్టుంది.. ‘పెళ్లిసందD’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల తర్వాత ‘ధమాకా’ చేసింది.. అమ్మడి పెర్ఫార్మెన్స్‌తో పాటు డ్యాన్స్‌కి కూడా ఆడియన్స్ ఫిదా అయిపోయారు.. ఇప్పుడు ఆమె చేతిలో ఏకంగా 8 సినిమాలున్నాయంటేనే క్రేజ్ పిచ్చ పీక్స్ అని అర్థమవుతోంది.. గాలి జనార్థన్ రెడ్డి కొడుకు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమాలో శ్రీలీలే కథానాయిక..
మహేష్ బాబు – త్రివిక్రమ్ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా సెట్లో అడుగు పెట్టింది.. బాలయ్య – అనిల్ రావిపూడి చిత్రంలో కీలకపాత్ర, నితిన్ 32, పంజా వైష్ణవ్ తేజ్ 4, రామ్ – బోయపాటి, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ ఇలా వరుస సినిమాలు, బిజీ షెడ్యూళ్లతో 2023 క్యాలెండర్ ఫిల్ అయిపోయింది.. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్‌ల క్రేజీ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో శ్రీలీల హీరోయిన్‌గా ఫిక్స్ అయింది అంటూ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వార్తలు వైరల్ అవుతున్నాయి..
అమ్మడి క్రేజ్, మేకర్స్ డిమాండ్ కారణంగా నిజమే అనుకున్నా కానీ.. అన్ని సినిమాలు చేతిలో పెట్టుకుని పవన్ సినిమాకి డేట్స్ ఎలా ఇస్తుంది అనేదే సమస్య.. సో, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఇది రూమర్ అనుకోవాల్సిందే.. ఇదిలా ఉంటే.. శ్రీలీల, రవితేజ పక్కన చేసినప్పుడే చిన్నపిల్లలా కనిపించిందనే కామెంట్స్ వినిపించాయి.. ఒకవేళ పవన్ పక్కన ఫిక్స్ అయితే.. మరీ చిన్న పిల్లలా ఉంటదేమోనంటూ టాక్ నడుస్తోంది..
ఈ సందర్భంగా అతిలోక సుందరి శ్రీదేవిని గుర్తు చేస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.. ఎన్టీఆర్ (1923) – శ్రీదేవి (1963) మధ్య 40 ఏళ్ల వయసు తేడా ఉంది.. పైగా ‘బడిపంతులు’ మూవీలో మనవరాలిగా నటించి, ఆయన పక్కనే కథానాయికగా అదరగొట్టేసింది.. ఇక ఏఎన్నార్ (1923) – శ్రీదేవిల మధ్య గ్యాప్ కూడా 40 ఏళ్లే.. అప్పట్లో వాళ్లిద్దరూ లెజెండ్స్.. వాళ్లతో కంపేర్ చేస్తే శ్రీలీల ఏం చిన్న పిల్లలా కనిపించదు.. మహేష్, పవన్ కూడా ఏజ్డ్ పర్సన్స్‌లా అనిపించరు అంటూ డిస్కస్ చేసుకుంటున్నారు..