Sridevi Soda Center: దీపావళి కానుకగా ‘జీ 5’ ఓటీటీలో విడుదలైన ‘శ్రీదేవి సోడా సెంటర్’ కు సూపర్ హిట్ టాక్..!

వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లు, ఒరిజిన‌ల్ మూవీస్‌, డిజిట‌ల్ రిలీజ్‌లు… ఏవి కావాల‌న్నా వీక్ష‌కులు ముందుగా ‘జీ 5’ ఓటిటి కే ఓటేస్తారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందీలో మాత్రమే కాదు…తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తోంది జీ5. మొబైల్, ట్యాబ్‌, డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లో ‘జీ 5’ ఉంటే చాలు… వినోదానికి ఏమాత్రం లోటు ఉండదు.

గత ఏడాది ‘అమృత రామమ్’ నుండి మొదలుపెడితే ’47 డేస్’, ‘మేకా సూరి’, ‘బట్టల రామస్వామి బయోపిక్కు’, ఇటీవల ‘నెట్’, ‘అలాంటి సిత్రాలు’ వరకూ ఎన్నో సినిమాలను ‘జీ 5’ డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ చేసింది.అంతేకాదు థియేటర్లలో విడుదలైన హిట్ సినిమాలను సైతం వీక్షకులకు అందిస్తోంది. దసరా పండక్కి శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’ను విడుదల చేసి ప్రజలకు వినోదం అందించిన జీ5….. ఇప్పుడు దీపావళి కానుకగా సుధీర్ బాబు రీసెంట్ హిట్ ‘శ్రీదేవి సోడా సెంటర్’ ను సైతం విడుదల చేసింది.

సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ ను కరుణ కుమార్ దర్శకత్వం వహించగా 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. ఆగష్టు లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.కులం, పరువు వంటి ఫాల్స్ ప్రెస్టేజ్ ల కోసం ఓ కన్నతండ్రి ఎంత దారుణానికి ఒడిగట్టాడు? తన కులం కాని అమ్మాయిని ప్రేమించిన హీరో ఎన్ని కష్టాలు పడ్డాడు? అనేది సినిమాలో చాలా హృద్యంగా చూపించారు. పరువు హత్యల నేపథ్యంలో తెలుగులో వచ్చిన గొప్ప సినిమా ఇది.దీపావళి నుండీ ‘జీ 5’ లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి విశేషాదరణ దక్కుతుంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus