మహేష్ బాబు 25 వ చిత్రంగా వస్తున్న ‘మహర్షి’ చిత్రం పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. మే 9 న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ప్రమోషన్స్ ఇప్పటికే మొదలు పెట్టేసింది చిత్ర యూనిట్. అయితే విడుదల చేసిన ఫస్ట్ లుక్స్ దగ్గర్నుండీ టీజర్, పాటల వరకూ అన్నీ మహేష్ బాబు గత చిత్రం ‘శ్రీమంతుడు’ లానే ఉన్నాయంటూ ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘శ్రీమంతుడు’ కథ ప్రకారం మల్టీ మిలినియర్ అయిన ఓ హీరో కొన్ని కారణాల వలన ఓ ఊరికి వస్తాడు. ఆ ఊరిలో ఉన్న అన్యాయాన్ని అరికట్టి అక్కడి జనానికి దేవుడవుతాడు.
ఇప్పుడు మహర్షి స్టోరీ లైన్ కూడా చాలా వరకూ అలానే ఉంది. మల్టీ మిలీనియర్ అయిన ఓ హీరో తన స్నేహితుడి కారణంగా ఓ ఊరు వస్తాడు, అక్కడ స్నేహితుడు ఆత్మహత్య తో పాటూ, రైతుల ఆత్మహత్యలు కూడా చూసి ఆధునిక పద్దతిలో వ్యవసాయం చేసి ఎలా రాణించవచ్చు అనే విధానాన్ని అక్కడి ప్రజలకి నేర్పిస్తాడు. చివరికి తన స్నేహితుడిది ఆత్మహత్య కాదు… హత్య అనేది తెలుసుకుని…. విలన్లని అంతం చేస్తాడు. ఈ రకంగా చూసుకుంటే ఇది చాలా వరకూ ‘శ్రీమంతుడు’ కథలానే అనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే చిత్ర యూనిట్ కూడా ‘మహర్షి’… ‘శ్రీమంతుడు’ లానే యూనివర్సల్ సబ్జెక్టు… అంటూ ప్రచారం చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే… అటు తిప్పి .. ఇటు తిప్పి ‘శ్రీమంతుడు’ తీసేసారాని అని అనుమానం కలుగక మానదు. కాబట్టి ఇప్పటి నుండి ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని పదే పదే ప్రస్తావించడం మానేస్తే బెటర్. మహేష్ గత చిత్రం విషయంలో కూడా ఇదే జరిగింది. దర్శక నిర్మాతలు పదే.. పదే ‘దూకుడు’ పేరు చెప్పి ప్రమోట్ చేసారు. చివరికి ‘ఆగడు’ చిత్రం పరాజయం పాలయ్యింది. ఇప్పుడు ‘మహర్షి’ విషయంలో కూడా ఇదే ఫార్ములా రిపీట్ అయితే.. ఈ చిత్రం కూడా ‘ఆగడు’ లానే డిజాస్టరవ్వడం ఖాయం.