టాలీవుడ్ టాప్ దర్శకుడు రాజమౌళి ఎప్పుడు తనాపి వివాదాలు లేకుండా చూసుకుంటాడు. ఒకవేళ తనపై ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే దానికి కంక్లూషన్ ఇచ్చేలా ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇస్తాడు. అప్పట్లో మగధీర సినిమా విషయంలో కూడా చిన్నపాటి విమర్శలకు గురైన జక్కన్న వెంటనే సునీల్ తో ‘మర్యాద రామన్న’ సినిమా తీసి తనపై వచ్చిన విమర్శలకు సమాధానం ఇచ్చాడు. అదే క్రమంలో ఈ మధ్య విడుదలయిన మనమంతా సినిమా విషయంలో కూడా మన రాజమౌళి పై చాలా విమర్శలు వచ్చాయి. వాటికి కౌంటర్ ఇచ్చాడు మన దర్శకధీరుడు. విషయం ఏమిటంటే…ఇటీవల విడుదలైన మనమంతా సినిమాను ఓ రేంజ్ లో పొగిడేశాడు రాజమౌళి. సినిమా చాలా బాగుందని, అందరూ కలిసి చూడాలంటూ ఆకాశానికెత్తేశాడు.
ఇక ఈ పొగడ్తలపై విమర్శలు మొదలయ్యాయి…ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు విమర్శలు మొదలు పెట్టారు. వాటికి సమాధానం ఇస్తూ రాజమౌళి….సినిమాకు తను ప్రచారం కల్పించడానికి 25శాతం కారణం సినిమాకు దర్శకుడు తన స్నేహితుడేనని, ఇక నిర్మాత తన బంధువేనని ఒప్పుకున్నాడు మన జక్కన్న. అదే క్రమంలో…తన వైఖరికి జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ….మనమంతా సినిమాకు తనే స్వయంగా ప్రచారం కల్పించడానికి 25శాతం కారణం వ్యక్తిగటం అయితే, 75శాతం కారణం మాత్రం సినిమాలో కంటెంట్ మాత్రమేనని వివరంగా చెప్పాడు మన జక్కన్న.