Mahesh Babu: రెండింటిలో ఓ కథ ఫైనలైజ్‌ చేసేస్తారా..!

మహేష్‌బాబు – రాజమౌళి సినిమా కోసం వెయిట్‌ చేయని సినిమా ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి లేదు. అలాంటి కాంబో మరి అది. ఎలాంటి కథనైనా ప్రేక్షకులు మెచ్చేలా తీర్చిదిద్దగలరు రాజమౌళి. అలాగే ఎలాంటి పాత్రనైనా అదిరిపోయేలా చేసి చూపించగలరు మహేష్‌బాబు. దీంతో ఈ కాంబో కోసం ప్రేక్షకులు ఏళ్ల తరబడి వెయిట్‌ చేస్తున్నారు. అయితే ఈసారి పక్కా అని తేల్చేశారు ఇద్దరు. ఇప్పుడు దీనికి దుబాయి వేదికగా మారింది అని చెబుతున్నారు.

Click Here To Watch NOW

‘సర్కారు వారి పాట’ షూటింగ్‌ ముగించుకుని వెకేషన్‌ కోసం మహేష్‌బాబు దుబాయి పయనం కట్టారు. మరోవైపు ‘ఆర్ఆర్‌ఆర్‌’ సందడి ముగియడంతో రాజమౌళి కోసం వెకేషన్‌ కోసం దుబాయి వెళ్లిపోయారు. ఇదేదే కాకతాళీయంగా ఇద్దరూ దుబాయి చేరలేదని సమాచారం. ఇద్దరూ ముందుగా అనుకునే అక్కడకు వెళ్లారని చెబుతున్నారు. అక్కడ తమ సినిమా గురించి చర్చలు జరిపి, ఓ కథ ఫైనల్‌ చేస్తారని సమాచారం. ఆ మధ్య ఓ సారి రాజమౌళి మాట్లాడుతూ ‘రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. త్వరలో మాట్లాడుకుని ఓ కథ సిద్ధం చేయాలి’ అని చెప్పారు గుర్తుందా.

ఆ మాటలే ఇప్పుడు జరుగుతున్నాయి అని సమాచారం. అయితే ఎప్పుడు ఎలా మాట్లాడతారు, ఆ విషయాన్ని ఎలా చెబుతారు అనేది తెలియాల్సి ఉంది. రాజమౌళి.. మహేష్‌ ముందు పెట్టే కథల్లో ఒకటి అడవి నేపథ్యంలో అడ్వెంచరస్‌ స్టోరీ, రెండోది బాండ్‌ స్టయిల్‌ స్టోరీ అంటున్నారు. మరి మహేష్‌బాబు ఏ కథకు ఓకే చెబుతారు అనేది ఇక్కడ ఆసక్తికరం. ముందుగా చెప్పిన్నట్లు ఎలాంటి కథ అయినా, పాత్ర అయినా ఇద్దరూ అదరగొట్టేస్తారు. కథపై క్లారిటీ వచ్చాక.. రాజమౌళి ఆ కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేసే పనిలో ఉంటారట.

ఈలోపు త్రివిక్రమ్‌ సినిమాను మహేష్‌బాబు పూర్తి చేసుకొని వస్తారని టాక్‌. జూన్‌ నుండి మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ సినిమా షూటింగ్‌ మొదలవుతుందని టాక్‌. వీలైనంత త్వరగా మహేష్‌, రాజమౌళి పూర్తి చేసుకుని షూటింగ్‌ మొదలుపెడితే సరి. ఎందుకు అని అంటారా. సినిమా మొదలయ్యాక సినిమా కాన్సెప్ట్‌ను షార్ట్‌గా చెప్పడం రాజమౌళికి అలవాటు. ఓ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ఇలాంటి విషయాలు చెబుతుంటారాయన. కాబట్టి షూటింగ్‌ మొదలవ్వడానికి ఎంత తక్కువ సమయం తీసుకుంటే మనకు అంతకుమంచింది. సో వెయిటింగ్‌ జక్కన్నా… అండ్‌ మహేష్‌.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus