SSMB28: సెంటిమెంట్‌ను త్రివిక్రమ్‌ వదలడట

మహేష్‌ బాబు – త్రివిక్రమ్‌ కాంబినేష్‌లో సినిమా కుదిరింది అని పుకారు ఇలా మొదలైందో లేదో. సినిమా కథ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అంటూ వార్తలొచ్చేశాయి. అంతేనా సినిమా పేరు కూడా ఒకటి బయటికొచ్చింది. ఇప్పుడు ఆ పేరుకు సెంటిమెంట్‌ను యాడ్ చేస్తూ కొత్త పుకార్లు బయటికొచ్చాయి. SSMB28 అంటూ అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేసరికి ఇక పుకార్లు జోరందుకున్నాయి. సినిమాకు ‘పార్థు’ అని పేరు పెడతారని ఫిక్స్‌ కూడా చేసేశారు పుకార్లజనులు. అయితే ఇప్పుడు వేరే పేరు అంటున్నారు.

త్రివిక్రమ్‌ సినిమాలకు ‘అ’ సెంటిమెంట్‌ ఇటీవల ఎక్కువైంది. తొలినాళ్లలో అలా లేకపోయినా… గత కొన్నేళ్లులో ‘అ’ కచ్చితంగా ఉండాల్సిందే. ‘అత్తారింటికి దారేది’, ‘అఆ’, ‘అరవింద సమేత’, ‘అజ్ఞాతవాసి’, ‘అలవైకుంఠపురములో..’ ఇలా అన్నీ ‘అ’తో మొదలయ్యేవే. ఇందులో ‘అజ్ఞాతవాసి’ ఒక్కటే దెబ్బ కొట్టింది కానీ.. ఆయన సెంటిమెంట్‌ సూపర్‌ అసలు. అందుకే ఈసారి కూడా ‘అ’తోనే పేరు చూస్తున్నారు. అయితే అది ‘అతడే పార్థు’ అని అనుకుంటున్నారని పుకార్లజనులు అంటున్నారు.

ప్రస్తుతం మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’ పనుల్లో ఉన్నారు. కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. పరిస్థితులు కుదుటపడ్డాక తిరిగి చిత్రీకరణ మొదలుపెడతారు. విదేశాల్లో ఈ షెడ్యూల్‌ ఉంటుందని టాక్‌. షెడ్యూల్‌ ప్రకారం సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలి. కానీ ఇప్పుడు అవుతుందా లేదో తెలియదు. అదయ్యాకే ‘అతడే పార్థు’ పట్టాలెక్కొచ్చు. ఈలోగా పూజా కార్యక్రమాలు ఉంటాయి. మే 31న అయితే అప్‌డేట్ ఉంటుంది. అయితే అదే రూపంలోనో అనేది తెలియాలి.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus