సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న SSMB29 పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా భారీ అంచనాల నడుమ ముందుకెళ్తోంది. కేవలం భారత్ లో మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్‌ను కూడా దృష్టిలో పెట్టుకొని, సుమారు 1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇటీవల గురువారం ప్రైవేట్ గాను సినిమా అసలు వర్క్ ను ప్రారంభించినట్లు టాక్, అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంక చోప్రా (Priyanka Chopra) , ప్రతినాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఎంపిక అయినట్లు సమాచారం.
SSMB29
రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమా కోసం రాజమౌళి క్షుణ్ణమైన స్క్రిప్ట్ పనులు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో కీలకమైన ఇంటర్నేషనల్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయట. తాజాగా టి-సిరీస్ సంస్థ ఈ చిత్రానికి పెద్ద మొత్తంలో ఫైనాన్స్ చేయబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. భూషణ్ కుమార్, రాజమౌళి మధ్య చర్చలు జరుగుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. హిందీ మార్కెట్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవడం కోసం హిందీ రైట్స్‌ను టి-సిరీస్‌కు అప్పగించే ప్రణాళికపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు, మ్యూజికల్ రైట్స్ కూడా టి-సిరీస్‌కి ఇవ్వబోతున్నారని టాక్. ఇంతకుముందు హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం అవుతుందని ప్రచారం జరిగింది. హాలీవుడ్ మద్దతుతో గ్లోబల్ బాక్సాఫీస్‌లో భారీ వసూళ్లు సాధించవచ్చని భావించారు. అయితే ఇప్పుడు టి-సిరీస్ పేరును తెరపైకి తీసుకురావడంతో, ప్రాజెక్ట్ ఎక్కడికెళ్లుతుందో చూడాలి.
రాజమౌళి ఆర్ఆర్ఆర్ (RRR Movie) వరకు ప్రతి ప్రాజెక్ట్ ప్రారంభంలో ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇచ్చేవారు. కానీ SSMB29 విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఈ సినిమా షూటింగ్ కెన్యా, ఇండియా వంటి విభిన్న ప్రాంతాల్లో జరగనుందని సమాచారం. రెగ్యులర్ షూటింగ్ ఎప్పటినుంచి మొదలవుతుందో అనేది ఇంకా తెలియలేదు.