బాలీవుడ్లో ‘తానాజీ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఓం రౌత్… ప్రభాస్ తో ‘ఆదిపురుష్’ అనే మోషన్ క్యాప్చర్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ అక్టోబర్ 2న రిలీజ్ అయ్యింది. అయితే ఈ టీజర్ కు మిశ్రమ స్పందన లభించింది. పాన్ ఇండియా మూవీగా హిందీ, తెలుగుతో పాటు తమిళ, మలయాళ కన్నడ భాషల్లో ఈ మూవీ 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
ఇదిలా ఉండగా..ఈ మూవీ హిందీ వెర్షన్ కు గాను శ్రీరాముడి పాత్రకు బాలీవుడ్ నటుడు శరత్ కేల్కర్ డబ్బింగ్ చెప్పబోతున్నాడు. ఇటీవల ఓ ఇంగ్లీష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆదిపురుష్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడతను.“ఆదిపురుష్ సినిమా అద్భుతంగా ఉంటుంది. నేను ఇంకా పూర్తిగా డబ్బింగ్ చెప్పలేదు. కానీ, నేను ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చూడటం జరిగింది. అవి చాలా బాగున్నాయి.
ఇంతకు ముందు ఎవ్వరూ ఇటువంటి ప్రయత్నం చేయలేదు. ఓం రౌత్ అద్భుతమైన దర్శకుడు. అతడు సినిమాను చూసే దృష్టికోణం వేరు. సినిమాలపై ఆయనకు అపారమైన జ్ఞానం ఉంది. ఇలాంటి దర్శకులు ఇప్పుడు మనకు చాలా అవసరం. టీజర్ చూసి దర్శకుడు ఓం ని విమర్శించే వారికి నేను ఒక్కటే చెప్తున్నా.! ఓం రౌత్ ను నమ్మండి. ఆయన త్వరలోనే మీరు ఆశ్చర్యపోయే సినిమాను అందించబోతున్నాడు. ‘ఆదిపురుష్’ కచ్చితంగా విజయం సాధిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.
శరత్ కేల్కర్ ప్రస్తుతం ‘హర హర మహాదేవ్’ సినిమాతో బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ చిత్రంలో శ్రీరాముడి పాత్రను పోషించేది ప్రభాస్ కదా.మరి ఈసారి ప్రభాస్ హిందీలో డబ్బింగ్ చెప్పుకోవడం లేదా? ‘సాహో’ ‘రాధే శ్యామ్’ చిత్రాలకు ప్రభాసే ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నాడు. అయితే ఆ సినిమాలు ప్లాప్ అయ్యాయి కాబట్టి ఈసారి శరత్ తో డబ్బింగ్ చెప్పిస్తున్నారేమో..!