50 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ నటుడు.. వైరల్ అవుతున్న ఫోటోలు..

ఈ వెడ్డింగ్ సీజన్‌లో సెలబ్రిటీలంతా ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు.. తమకిష్టమైన వ్యక్తులతో ఏడడుగులేసి.. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు.. ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటీనటులు వివాహ బంధంలోకి ఎంటర్ అయ్యారు.. రీసెంట్‌గా ప్రముఖ సీరియల్ నటుడు సచిన్ ష్రాఫ్ 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు.. ‘తారక్ మెహతాకా ఉల్టా చష్మా’ సీరియల్‌తో బుల్లితెరపై నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న సచిన్.. ఫిబ్రవరి 25న ఇంటీరియర్ డిజైనర్ అయిన చాందినిని వివాహం చేసుకున్నాడు..

అత్యంత సన్నిహితులు, బంధు మిత్రుల మధ్య వీరి వివాహ వేడుకు అంగరంగ వైభవంగా జరిగింది.. వీరిది ప్రేమ వివాహమని తెలుస్తోంది.. ఈ వెడ్డింగ్ సెరమనీలో పలువురు బుల్లితెర నటులు సందడి చేశారు.. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు..

ఇక సచిన్ ష్రాఫ్‌కు ఇది రెండవ పెళ్లి.. 2009లో జుహి పార్మర్‌ను మ్యారేజ్ చేసుకుని.. 2018లో ఆమెకు విడాకులు ఇచ్చాడు.. ప్రస్తుతం సచిన్ ష్రాఫ్-చాందినిల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

1

2

3

4

5

 

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus