తెలుగమ్మాయి అంజలి (Anjali) అందరికీ సుపరిచితమే. ‘ఫోటో’ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘బింబిసార’ (Bimbisara) దర్శకుడు మల్లిడి వశిష్ట్ (Mallidi Vasishta) తెరకెక్కించిన ‘ప్రేమలేఖ రాశా’ అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఇవి రెండూ ప్లాప్ కావడంతో ఇక్కడ ఛాన్సులు రాలేదు. దీంతో చెన్నైకి వెళ్ళిపోయి అక్కడ యాక్టింగ్ ట్రయిల్స్ వేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో చేసిన ‘షాపింగ్ మాల్’ (Shopping Mall) ‘జర్నీ’ (Journey) సినిమాలు ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడేలా చేశాయి.
njali
అవి తెలుగులో కూడా హిట్ అవ్వడంతో ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో వెంటనే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే మల్టీస్టారర్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా హిట్ అవ్వడంతో అంజలి దశ తిరిగిపోయింది అని చెప్పాలి. ఆ తర్వాత ఆమె ఖాతాలో బోలెడన్ని సక్సెస్ ఫుల్ మూవీస్ పడ్డాయి. ఇదిలా ఉండగా.. అంజలి వయసు ఇప్పుడు 38.
ఇప్పటికీ లీడ్ రోల్స్ చేసే ఛాన్సులు దక్కించుకుంటూనే ఉంది. ఈ సంక్రాంతికి వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ లో (Game Changer) ఆమె చరణ్ సరసన నటించిన సంగతి తెలిసిందే. మరోపక్క ఆమె పెళ్లి గురించి కూడా నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. కానీ ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు అని ఆమె చెప్పకనే చెప్పింది. ఇవి పక్కన పెట్టేస్తే, అంజలి తాజాగా ఓ ఫోటో షూట్లో పాల్గొంది.
అందులో అంజలి ఫోటోలు చూసిన కొందరు నెటిజన్లు ఆమె బేబీ బంప్ కనిపిస్తుంది అంటూ విమర్శలు చేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు అంజలి బాగా సన్నబడింది. అయినా సదరు నెటిజన్లకు ఆమె బేబీ బంప్ ఎలా కనిపించిందో మరి. దీనిపై అంజలి రియాక్ట్ అయితే చాలా వైల్డ్ గా ఉండొచ్చు.