Actress: వైరల్ అవుతున్నగౌహర్ ఖాన్ లెటేస్ట్ పోస్టు!

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన సూపర్‌ హిట్ సినిమా శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌. ఇందులోని ‘నాపేరే కాంచనమాల’ అనే స్పెషల్‌ సాంగ్‌ అభిమానులను ఓ రేంజ్‌లో అలరించింది. ఈ పాటతో తెలుగు కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టింది బాలీవుడ్‌ బ్యూటీ గౌహార్‌ ఖాన్‌. దీని తర్వాత పలు బాలీవుడ్‌ సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార. రాకెట్‌ సింగ్‌, సేల్స్‌మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌, వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబై, ఇషాక్‌ జాదే, క్యా కూల్‌ హై హమ్ 3, బద్రీనాథ్‌ కి దుల్హనియా, బేగమ్‌ జాన్‌, తేరే ఇంతేజార్‌ వంటి హిట్‌ సినిమాలు గౌహార్‌ ఖాన్‌కు మంచి పేరు తెచ్చుకొచ్చాయి.

ఓ వైపు సినిమాలు చేస్తూనే తాండవ్, స్టాల్ సిటీ, శిక్ష మాండల్ వెబ్ సిరీస్‌ల్లోనూ నటించింది. పలు టీవీ రియాలిటీష్లోనూ సందడి చేసింది. ఇక సోషల్‌ మీడియాలోనూ ఈ అమ్మడకు ఓ రేంజ్‌లో ఫాలయింగ్‌ ఉంది. ఇలా బుల్లితెర, వెండితెరపై దూసుకెళుతోన్న గౌహార్‌ ఖాన్‌ ఒక శుభవార్త చెప్పింది. తాజాగా ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది.

దీంతో అనుష్కా శర్మ, సోఫీ చౌదరి వంటి బాలీవుడ్ స్టార్‌ సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు గౌహార్‌ ఖాన్‌ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రముఖ గాయకుడు, కంపోజర్ ఇస్మాయిల్ దర్భార్ కుమారుడైన్ జైద్ దర్బార్ ని 2020 లో వివాహం చేసుకుంది గౌహార్‌ ఖాన్‌. తమ దాంపత్య బంధానికి గుర్తుగా గత ఏడాది డిసెంబర్ లో తాను తల్లిని కాబోతున్నా అంటూ ప్రకటించింది.

ఆ మద్య తన (Actress) సీమంతం కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇన్‌స్ట్రాగామ్ లో షేర్ చేయగా తెగ వైరలయ్యాయి. తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమె తల్లిగా జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం పలికింది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus