Actress: ఆ భయంతో స్టార్ హీరో ఫోన్ నెంబర్ బ్లాక్ చేసిందట!

కొత్త నెంబర్ల నుండి ఫోన్లు వస్తున్నాయి అంటే సామాన్యులైనా ఒక్కసారి ఆలోచనలో పడుతుంటారు. ‘ఈ నెంబర్ ఎవరిది? ఇంతకు ముందు ఎప్పుడూ ఈ నెంబర్ నుండి ఫోన్ రాలేదే’ అనే ప్రశ్నలు మైండ్లోకి వస్తాయి. అనుమానంతో మొదలై భయం వరకు వెళ్తుంది ఆలోచన.. అనడంలో అతిశయోక్తి లేదు. సైబర్ క్రైమ్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయిన రోజులివి. అందుకే ఇలాంటి భయాలు అందరిలో పుట్టుకున్నాయి. ఇందుకు సెలబ్రిటీలు కూడా అతీతం కాదు.

అలాంటి భయాల కారణంగా ఓ నటి (Actress) ఏకంగా నెంబర్ నే బ్లాక్ చేసేసిందట.ఓ స్టార్ హీరో కొత్త నెంబర్ నుండి ఫోన్ చేస్తుంటే.. వెంటనే ఆ నెంబర్ ను బ్లాక్ చేసిందట ఆ నటి. ఈ క్రమంలో ఆమెకు సినిమా ఛాన్స్ కూడా మిస్ అయిపోయేదని ఆమె చెప్పి షాకిచ్చింది. విషయంలోకి వెళితే… యంగ్ బ్యూటీ షెహనాజ్ గిల్ తనకున్న ఓ అలవాటు కారణంగా ‘కిసీ క భాయ్ కిసీ కీ జాన్’ సినిమా ఛాన్స్ మిస్ అయ్యేదని ఇటీవల చెప్పింది.

‘కొత్త నెంబర్ల నుండి కాల్స్ వస్తే వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టేయడం నాకున్న అలవాటు. అందులో భాగంగానే సల్మాన్ ఖాన్ నెంబర్ కూడా బ్లాక్ చేసేశాను. ‘కిసీ క భాయ్ కిసీ కీ జాన్’ చిత్రంలో ఛాన్స్ కోసం సల్మాన్ సర్ నాకు కాల్ చేశారు. అయితే అది ఎవరిదో నెంబర్ అనుకుని మొదట పట్టించుకోలేదు. రెండోసారి మళ్ళీ ఆ నెంబర్ నుండీ కాల్ వస్తే ఏకంగా బ్లాక్ చేసేశాను. ఆ తర్వాత సల్మాన్ నాకు కాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు మెసేజ్ వచ్చింది.

వెంటనే ఆ నంబర్ అన్ బ్లాక్ చేసి కాల్ బ్యాక్ చేశాను. అప్పుడు నాకు ఈ సినిమాలో ఆఫర్ చేస్తున్నట్టు చెప్పారు. లేదంటే ఈ అవకాశం నాకు మిస్సయ్యేది’ అంటూ షెహనాజ్ చెప్పుకొచ్చింది. ‘కిసీ క భాయ్ కిసీ కీ జాన్’ చిత్రానికి సల్మాన్ ఖాన్ కూడా ఓ నిర్మాత అనే సంగతి అందరికీ తెలిసిందే.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus