బాలయ్య (Nandamuri Balakrishna) సినీ కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాలలో ఆదిత్య 369 (Aditya 369) ముందువరసలో ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో అప్పట్లో కోటీ 60 లక్షల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు మొదట అనుకున్న టైటిల్ కాలయంత్రం కాగా చివరకు ఆదిత్య 369 అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. మొదట ఈ సినిమా కోసం విజయశాంతి (Vijayashanti)పేరును మేకర్స్ పరిశీలించగా ఆమె డేట్స్ విషయంలో ఇబ్బందులు ఎదురవడంతో మోహినిని (Mohini) ఎంపిక చేశారు.
సినిమాలో శ్రీ కృష్ణదేవరాయలు పాత్రకు బాలయ్య పర్ఫెక్ట్ ఛాయిస్ అని భావించి బాలయ్యను ఈ సినిమాలో హీరోగా ఎంపిక చేశారు. సూర్యుడికి పర్యాయపదం ఆదిత్యుడు కావడంతో ఈ సినిమా టైటిల్ లో ఆదిత్య చేరగా మెషీన్ కు నంబర్ ఉండాలని 369 నంబర్ పెట్టారు. ఈ సినిమా విడుదలై 33 సంవత్సరాలు కాగా ఈ సినిమాను ఇప్పటితరం పిల్లలు, పెద్దలు, అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడతారు.
ఆదిత్య 369 సినిమాకు కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని బాలయ్య చెబుతుండగా ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుంది? ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? అనే ప్రశ్నలకు జవాబులు దొరకాల్సి ఉంది. ఈ సినిమాకు ఆదిత్య 999 మ్యాక్స్ టైటిల్ ను పరిశీలిస్తున్నారు. కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో భవిష్యత్తు కథాంశాలతో తెరకెక్కుతున్న సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
ఆదిత్య 999 మ్యాక్స్ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య మోక్షజ్ఞ కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టగా మోక్షజ్ఞను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.