సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం.పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఫిబ్రవరి 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ సినిమాపై ఉన్న డేడికేషన్ తో ఈమె ఓపిక తెచ్చుకొని మరి ఈ సినిమా కార్యక్రమాలకు హాజరవుతున్నానని తెలిపారు.ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సమంత పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా కోసం డైరెక్టర్ గుణశేఖర్ ఎంతగానో శ్రమించారు. ఈ సినిమా స్టోరీ రాస్తున్న సమయంలో ఈయన ఈ సినిమాలో నయనతార అయితే బాగుంటుందని నయనతారను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో నయనతార స్థానంలో సమంత రావడానికి గల కారణం తన కుమార్తె నీలిమ అని డైరెక్టర్ ఓ సందర్భంలో తెలియజేశారు. ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసుకుంటున్న సందర్భంలో తన కూతురు నీలిమ ఈ కథకు సమంత కరెక్టుగా సూట్ అవుతుందని సలహా ఇచ్చారట.
అయితే సమంత మోడ్రన్ లుక్ లో ఉంటుందని ఆలోచించగా ఆమె రంగస్థలం సినిమాలో నటించిన రామలక్ష్మి పాత్ర తనకు గుర్తుకు వచ్చిందని తెలిపారు. పల్లెటూరి అమ్మాయి పాత్రలో సమంత ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ క్రమంలోనే శకుంతల పాత్రలో సమంత సరిగ్గా సరిపోతుందని భావించిన గుణశేఖర్ ఆమెను కలిసి కథ వివరిస్తున్న సమయంలో కూడా తనలో సమంతను కాకుండా శకుంతలని చూసానని అందుకే ఈ సినిమాకు సమంతను ఎంపిక చేసామని గుణశేఖర్ తెలిపారు.