ఆ వీడియో కారణంగా భర్తతో విడాకులకు సిద్ధపడిన నటి ఎవరంటే..?

సెలబ్రిటీల లైఫ్ అంటే లగ్జరీగా ఉంటుంది.. దేనికీ లోటుండదు అనుకుంటుంటాం కానీ ఎవరి కష్టాలు వాళ్లకుంటాయి.. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి త్వరగా ఆకర్షణకు లోనై ప్రేమలో పడడం.. పెళ్లి, కొన్నాళ్ల కాపురం తర్వాత విడాకులు.. కొన్ని బంధాలు కేవలం సహజీవనంతోనే ముగిసిపోతుంటాయి.. కలవడం, విడిపోవడం అనేది పెద్ద మేటర్ కాదన్నట్టు వ్యవహరిస్తుంటారు కొందరు.. ఇక నటీమణుల విషయంలో పెళ్లి తర్వాత గతం గతహా అన్నట్టు చూసుకునే భర్త రావడం అదృష్టమనే చెప్పాలి..

ఏ చిన్న పొరపాటు జరిగినా డివోర్స్ పేరుతో కోర్టు మెట్లెక్కడానికి రెడీగా ఉంటారు.. ఇటీవల ఓ నటి విషయంలో ఇలాగే జరిగింది.. ఓ వీడియో విషయంలో భార్యభర్తలు ఇద్దరి మధ్య వివాదం తలెత్తడంతో విడిపోయే వరకు వెళ్లారు.. వివరాల్లోకి వెళ్తే.. అర్చన చందోక్.. కోలీవుడ్‌లో పాపులర్ యాంకర్, యాక్ట్రెస్ అలాగే తమిళ్ బిగ్ బాస్ నాలుగవ సీజన్ కంటెస్టెంట్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె 19 ఏళ్ల తన వైవాహిక జీవితానికి స్వస్తి పలకాలని, తన భర్త వినీత్‌కు విడాకులు ఇద్దామనుకున్న విషయాలను తాజగా చెప్పుకొచ్చింది.

తన జీవితంలో జరిగిన సంఘటనలను తలుచుకుని ఓ షోలో బోరున విలపించింది అర్చన. దీనికి కారణం ఓ బాత్‌రూమ్ వీడియో కారణంగా ఆమె మీద వచ్చిన నెగిటివిటీ.. బిగ్ బాస్ తర్వాతే తన మీద నెగిటివిటీ వచ్చేసిందని.. బాత్‌ రూమ్ టూర్ వీడియోతో అది మరింత ఎక్కువవడం.. భర్తకు దూరమవాలనుకోవడం గురించి అర్చన చెప్పిన వీడియో వైరల్ అవుతోంది.. అర్చన మాట్లాడుతూ.. ‘‘ఒక నెల రోజుల క్రితం నా భర్త, నేనూ విడిపోదాం అనుకున్నాం..

గత కొంత కాలంగా మా ఇద్దరి మధ్య అభిప్రాయా భేదాలు వస్తుండటంతో మేం ఈ నిర్ణయానికి వచ్చాం.. ఇక దానికి సంబంధించిన విడాకుల పత్రాలను సైతం మేం రెడీ చేసుకున్నాం.. ఈ క్రమంలోనే మా కుతురు మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడింది.. దాంతో మా మనసులు మార్చుకుని ఇప్పుడు కలిసి ఉంటున్నాం’’ అంటూ భావోద్వేగంతో చెప్పుకొచ్చింది..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus