Bigg Boss 5 Telugu: ‘బిగ్ బాస్5’ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్..!

‘బిగ్‏బాస్ 5’ గతవారం ఘనంగా ప్రారంభమైంది. ఆ ప్రీమియర్ ఎపిసోడ్ కోసమే.. రూ.2.5 కోట్ల వరకు నిర్వాహకులు ఖర్చు చేసినట్టు భోగట్టా. ఇది పక్కన పెడితే ఈసారి అమ్మాయిలు కూడా హౌస్ లో ఎక్కువ మందే ఉన్నారు. అల్లర్లు,గొడవలు, కామెడీ, భావోద్వేగాలు వంటివి రెండో రోజు నుండే కంటెస్టెంట్లు మనకు అందించడం మొదలుపెట్టారు.ఎప్పటిలాగే కొంతమంది గ్రూపులుగా విడిపోయి గేమ్ ఆడడం వంటివి కూడా మనం చూస్తూనే వస్తున్నాం. అగ్నికి ఆజ్యం తోడైనట్లు బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు కూడా అలాగే ఉన్నాయి లెండి.

ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు అనే అంశం పై కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. హమీద లేదా సరయు లలో ఒకరు మొదటివారం హౌస్ నుండీ బయటకి వచ్చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరో పక్క వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా ఉండబోతుందని తాజా సమాచారం. ప్రతీ సీజన్లోనూ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తర్వాత వైల్డ్ కార్డు ద్వారా ఓ కంటెస్టెంట్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుండడం ఆనవాయితీగా వస్తోంది.ఈ సీజన్లో కూడా అదే రిపీట్ కాబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ క్రమంలో వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ ఎవరు అనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో నెలకొంది.

అందుతున్న సమాచారం ప్రకారం యాంకర్ వర్షిణి.. వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇది నిజమే అయితే హౌస్ కు మరింత గ్లామర్ పెరిగే అవకాశం ఉంది. నిజానికి గత వారమే వర్షిణి హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో ఆమె డ్రాప్ అయినట్టు కూడా వార్తలు వచ్చాయి. మరి ఈసారి ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ వస్తున్న వార్తల్లో నిజముందా? లేదా? అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. ఆదివారం నాడు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ తో ఈ విషయం పై క్లారిటీ వస్తుంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus