సోషల్‌ మీడియా బెదిరింపులపై స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు, వివాదాలకు ఎప్పుడూ సన్నిహితంగా ఉండే అనురాగ్‌ కశ్యప్‌ (Anurag Kashyap) చుట్టూ మరోసారి వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సారి ఆయన ఓ వర్గంపై చేసిన వ్యాఖ్యలే కారణం. ‘పూలే’ సినిమా విడుదల సందర్భంగాయ అనురాగ్‌ కశ్యప్‌ బ్రాహ్మణులపై చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తననే కాకుండా, తన కుటుంబానికి కూడా బెదిరింపులు, ఇబ్బందికర కామెంట్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆయన క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియాలో ఓ నోట్ షేర్‌ చేశారు.

Anurag Kashyap

ఓ వర్గానికి చెందిన వారిపై తాను చేసిన కామెంట్స్ వల్ల కొందరి మనోభావాలు తిన్నాయని, దీంతో తన కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని అనురాగ్ కశ్యప్‌ చెప్పారు. నేను వాళ్లందరికీ క్షమాపణలు చెబుతున్నా. నా కుటుంబాన్ని చంపేస్తామంటున్నారు. నా కూతురుపై కూడా అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. జీవితంలో ఆమె కంటే నాకు విలువైనదేదీ లేదు. మీకు కోపం వస్తే నన్ను నిందించండి. కానీ, నా కుటుంబాన్ని వివాదంలోకి లాగొద్దు.

మీరు క్షమాపణలు కోరారు. నేను చెప్పాను అని నోట్‌లో రాసుకొచ్చారు అనురాగ్‌ కశ్యప్‌. సామాజిక సంస్కర్తలు జ్యోతిరావు, సావిత్రిబాయి ఫూలే జీవిత చరిత్రతో ఓ సినిమా రూపొందిస్తున్నారు. ఆ సినిమా సెన్సార్‌కు సంబంధించి ఆయనకు సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, బ్రాహ్మణ సమాజంలోని ఓ వర్గంపై అనురాగ్‌ కశ్యప్‌ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో కొన్ని అభ్యంతర వ్యాఖ్యలు కూడా చేశారు.

మరోవైపు సినిమాలో బ్రాహ్మణులను అవమానపరిచేలా కొన్ని అంశాలు ఉన్నాయని, అందుకే సెన్సార్ బోర్డు సర్టిఫై చేయలేదు అని ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ఇక ఈ సినిమాలో ఫూలే పాత్రలో గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీ నటించాడు. అతని భార్య సావిత్రి బాయి ఫూలే పాత్రలో బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు భార్య పత్రలేఖ నటించారు. ఈ నెల 11నే సినిమా విడుదల కావాల్సి ఉన్నా సెన్సార్‌ కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది.

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’… ఇదే లాస్ట్ ఛాన్స్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus