‘నన్ను ఏమైనా అనండి.. నా కూతుర్ని అంటే ఊరుకోను’

సినిమా వాళ్లకు సంబంధించిన ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది. ఒక్క నటీనటులపైనే కాకుండా.. వాళ్ల ఫ్యామిలీ మీద కూడా జనాల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. దీనివలన చాలా మంది సెలబ్రిటీలు ఇబ్బంది పడ్డారు. తాజాగా బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. ఇటీవల తన భార్య ఐశ్వర్యారాయ్, కూతురు ఆరాధ్యతో కలిసి మాల్దీవులకు వెళ్లాడు అభిషేక్ బచ్చన్. ఎయిర్ పోర్ట్ లో వీరి ఫ్యామిలీ మీడియా కంట పడింది.

ఈ క్రమంలో కొందరు మీడియా సభ్యులు ఆరాధ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అప్పటివరకు నార్మల్ గా నడిచిన ఆరాధ్య.. ఫొటోగ్రాఫర్లను చూడగానే క్యాట్ వాక్ చేసింది. ఆమె సరదాగా.. క్యాట్ వాక్ చేస్తుండడంతో ఐశ్వర్య కూడా నవ్వేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. కొందరు నెటిజన్లు ఆరాధ్యను బాగా ట్రోల్ చేశారు. దీంతో అభిషేక్ బచ్చన్ సీరియస్ అయ్యాడు. ”నేను పబ్లిక్ ఫిగర్ ని. నన్ను ఎంతైనా ట్రోల్ చేయండి పడతాను..

కానీ నా కూతుర్ని అనే హక్కు మీకు లేదు. దమ్ముంటే ఆ మాటలు నా ఎదురుగా వచ్చి అనండి” అంటూ ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో చాలా మంది అభిషేక్ బచ్చన్ కు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus