ఆ స్టార్ హీరో తమ్ముడిని రాత్రి 2 వరకు ఏడిపించిన దర్శకుడు..!

కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగ్ లు ఎప్పుడు వాయిదా పడతాయో.. థియేటర్లు ఎప్పుడు మూతపడతాయో అర్ధం కాని పరిస్థితి. కాబట్టి చిన్న హీరోల దగ్గర్నుండీ స్టార్ హీరోల వరకు.. ఒక్కొక్కరు రెండు అంతకంటే పైగా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.అందుకు తగినట్టే షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలందరి పరిస్థితి అంతే. మరోపక్క దర్శకులకు కూడా నిర్మాతలు డెడ్ లైన్స్ పెడుతూ టెన్షన్ పెడుతున్నారు. అయితే ఓ దర్శకుడికి నిర్మాత దగ్గర్నుండీ ఎలాంటి ప్రెజర్ లేదు. హీరో కాల్షీట్ల కోసం వేచి చూడాల్సిన పని కూడా లేదు.

కానీ తాను పనిచేస్తున్న హీరోని రాత్రి రెండు గంటల వరకు ముప్పు తిప్పలు పెట్టాడట ఆ దర్శకుడు. ఆ దర్శకుడు ఇది వరకు ఓ స్టార్ సినిమాటోగ్రాఫర్. తమిళంలో సినిమాలు చేసాడు. అవి బాగానే ఆడాయి. దాంతో తెలుగులో ఓ పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరో ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా కూడా బాగానే ఆడింది. అయితే వెంటనే మరో టాలీవుడ్ హీరో ఛాన్స్ ఇవ్వలేదు. దాంతో తమిళంలో ఓ సినిమా మొదలుపెట్టాడు. అది దాదాపు పూర్తయ్యింది. మరోపక్క తెలుగులో ఈ మధ్యనే ఓ స్టార్ హీరో తమ్ముడితో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. అది ఇంకా మొదలుకాకుండానే..

తెలుగులో మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చిన హీరో మళ్ళీ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దానిని ఓ బడా ప్రొడ్యూసర్ నిర్మిస్తున్నాడు. ఇంకేముంది ఓ పక్కన తమిళ్ సినిమా ప్రమోషన్స్ అలాగే పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరో సినిమాల కోసం.. ఆ స్టార్ హీరో తమ్ముడి సినిమాని ఈ మధ్యనే మొదలుపెట్టాడు. మొదటి రోజే ఏకంగా నైట్ 2 వరకు ఆ హీరోని విడిచిపెట్టలేదట.డిన్నర్ కూడా చేయనివ్వలేదట. ‘ఇక చాలు సర్’ అన్నా సరే ఆ దర్శకుడు వినలేదని తెలుస్తుంది. నిర్మాత కూడా ఓపిక నశించి 10 గంటలకే వెళ్లిపోవడంతో ఆ హీరో తిప్పలు మరింత ఎక్కువైనట్టు తెలుస్తుంది. ఈ స్టార్ హీరో తమ్ముడు తెలుగులో రెండు సినిమాలు చేసాడు. అందులో ఒకటి ఓటిటిలో రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Share.