ఓ స్టార్ హీరో గాయాల పాలవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.విషయంలోకి వెళితే.. హీరో కార్తీ (Karthi) షూటింగ్లో గాయపడినట్టు తెలుస్తుంది. ఇటీవల ‘సర్దార్ 2’ టీం షూటింగ్ నిమిత్తం మైసూర్ వెళ్ళింది. అక్కడ కీలక షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో యాక్షన్ సీన్స్ కూడా తీశారట. ఇందులో భాగంగా కార్తీకి గాయాలు అయినట్లు తెలుస్తుంది. వెంటనే సిబ్బంది హాస్పిటల్ కు తరలించారట. చికిత్స అందించిన వైద్యులు అతన్ని వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట.
అందువల్ల కార్తీ తిరిగి చెన్నై వచ్చేసినట్టు తెలుస్తుంది. ఇక హీరో లేకుండా మిగతా తారాగణంతో మిగిలిన షెడ్యూల్ ను ఫినిష్ చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. ఆ తర్వాత హీరో కోలుకుని మిగిలిన షెడ్యూల్లో పాల్గొంటారు. ‘సర్దార్ 2’ షూటింగ్లో ఇలాంటి ప్రమాదం జరగడం ఇది రెండోసారి. మొదటి షెడ్యూల్లో దురదృష్టవశాత్తు ఒక స్టంట్ మాస్టర్ మృతి చెందడం జరిగింది. దీంతో చిత్ర బృందం కలవరపడుతున్నట్టు కూడా చెన్నై మీడియా వర్గాల సమాచారం.
ఇక 2022 దీపావళి కానుకగా వచ్చిన ‘సర్దార్’ (Sardar) చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.100 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. పి.ఎస్.మిత్రన్ (P. S. Mithran) దీనికి దర్శకుడు. మంచి మెసేజ్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఇది. అందుకే ‘సర్దార్ 2’ కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీని తర్వాత ‘ఖైదీ’ (Kaithi) సీక్వెల్లో కూడా కార్తీ నటించబోతున్నాడు.