టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన చిరంజీవి ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. చిరంజీవి తర్వాత సినిమాల స్క్రిప్ట్ లలో కూడా మార్పులు జరుగుతున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. చిరంజీవి రీఎంట్రీలో ఎక్కువగా రీమేక్ సినిమాలలో నటిస్తుండగా ఈ విషయంలో ఫ్యాన్స్ సైతం సంతోషంగా లేరు. అయితే విక్రమ్ సక్సెస్ తో కమల్ హాసన్ చిరంజీవిపై ఒత్తిడి పెంచారు. వైవిధ్యమైన కథను ఎంచుకుని ఆరు పదుల వయస్సులో కమల్ హాసన్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే.
చిరంజీవి కూడా తనకు సూటయ్యే వైవిధ్యమైన కథలకు ఓటేస్తే బెటర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆచార్య సినిమా చిరంజీవి కెరీర్ లోనే భారీగా నష్టాలను మిగిల్చిన సినిమాలలో ఒకటి కావడం గమనార్హం. మూస కథలతో తెరకెక్కిన మాస్ సినిమాలను ప్రేక్షకులు సైతం రిజెక్ట్ చేస్తున్నారు. మోహన్ లాల్, కమల్ హాసన్, మరి కొందరు హీరోలు భిన్నమైన కథలను ఎంచుకుంటూనే బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకుంటున్నారు. చిరంజీవి కూడా ఆ హీరోల బాటలో అడుగులు వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
చిరంజీవి మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ సినిమాలలో నటించడం అభిమానులలో చాలామందికి అస్సలు ఇష్టం లేదనే సంగతి తెలిసిందే. చిరంజీవి ఒక్కో సినిమాకు ప్రస్తుతం 30 నుంచి 35 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కొత్త కథలలో నటించడం వల్ల ప్రేక్షకులకు కూడా సరికొత్త అనుభూతిని ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది.
చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలలో నటిస్తున్నారు. చిరంజీవి వెంకీ కుడుముల ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.