బెదిరింపులు వస్తున్నా.. సినిమా షూటింగ్‌ చేస్తున్న స్టార్‌ హీరో.. ఎందుకంటే?

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌కు  వరుసగా బెదిరింపు కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. గతంలో జరిగిన కొన్ని విషయాల్లో క్షమాపణలు చెప్పకపోతే హతమారుస్తాం అంటూ కొందరు. డబ్బులు ఇవ్వకపోతే అంతుచూస్తాం అంటూ మరికొందరు ఆయనను బెదిరిస్తున్నారు. ఇటీవల సల్మాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీని కూడా హతమార్చారు. ఈ నేపథ్యంలో సల్మాన్‌ భద్రత విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయితే ఇంత ఇబ్బందిలోనూ ఆయన సినిమా షూటింగ్‌ చేస్తున్నారు. ఎందుకు అని చూస్తే.. డేట్‌ సమస్య అని తెలుస్తోంది.

Salman Khan

మొన్నీమధ్యే మన వెబ్‌సైట్‌లో ‘రంజాన్‌ రంజు రంజుగా’ అనే వార్త చదివే ఉంటారు. అందులో చెప్పిన విషయమే ఇప్పుడు సల్మాన్‌ కచ్చితంగా షూటింగ్‌ వచ్చే పరిస్థితిని తీసుకొచ్చింది అని చెబుతున్నారు. ఏటా రంజాన్‌ సందర్భంగా సల్మాన్‌ ఖాన్‌ నుండి ఓ సినిమా పక్కాగా వస్తూ ఉంటుంది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఏటా ఆయన ఆ పండక్కి సినిమా తెస్తూనే ఉన్నారు. ఇప్పుడలా వచ్చే ఏడాది తన కొత్త సినిమా ‘సికిందర్‌’ను రిలీజ్‌ చేసే పనిలో ఉన్నారు.

ఈ క్రమంలో ముంబయిలో వరుస షెడ్యూళ్ల షూటింగ్‌ పెట్టుకున్నారు సల్మాన్‌ ఖాన్‌. అయితే బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)  సినిమా షూటింగ్‌లు వాయిదా వేయకూడదని నిర్ణయించుకున్నారట. అయితే ముంబయిలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు అని.. హైదరాబాద్‌లో సినిమా షూటింగ్‌ పెట్టుకున్నారు. ఇటు నిర్మాతకు నష్టం రాకూడదు, రంజాన్‌కి సినిమా రావాలి ఆనే ఆలోచనతోనే సినిమా షూటింగ్‌ చేస్తున్నారు.

‘సికిందర్‌’ (Sikandar)  సినిమాను ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్‌ (A.R. Murugadoss)  తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సాజిద్ నడియాడ్‌వాలా (Sajid Nadiadwala) నిర్మిస్తున్నారు. సౌత్‌ ఫార్ములాతో ఇప్పటికే ‘కిసీ కా భాయి కిసీ కీ జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) అనే సినిమాను రీమేక్‌ చేసిన సల్మాన్‌ ఖాన్‌ బాక్సాఫీసు దగ్గర బొక్కబోర్లా పడ్డాడు. ఈసారి ఫార్ములా కాదు.. ఒరిజినల్‌ కథే ఇక్కడి నుండి కావాలి అని మురుగదాస్‌తో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే మురుగదాస్‌ ఆమిర్‌ ఖాన్‌కు (Aamir Khan) ‘గజిని’ అనే బ్లాక్‌బస్టర్‌ సినిమా ఇచ్చిన విషయం తెలిసిందే.

సూర్యతో సినిమా మిస్ అయ్యింది.. ‘కంగువా’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus