సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉంది. ఈ క్రమంలోనే సినిమాలలో కొనసాగిన వారు రాజకీయాలలోకి వెళ్లి రాజకీయాలతో బిజీ అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే సినిమాలకు దూరం అవుతూ ఉంటారు. తాజాగా రాజకీయాలలో ఎంతో బిజీగా అవడంతో యంగ్ హీరో ఉదయనిది స్టాలిన్ సినిమాలకు గుడ్ బై చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న ఉదయనిది స్టాలిన్ హీరోగా ఇండస్ట్రీలో అంతే పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.
అయితే ఎన్నికలలో భాగంగా ఉదయినిది స్టాలిన్ ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈయన మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు. తమిళనాడు క్రీడా శాఖ మంత్రిగా ఉదయినిది స్టాలిన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో భాగంగా ఉదయనిది స్టాలిన్ మాట్లాడుతూ తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతున్నానని ఇకపై తాను సినిమాలలో నటించననీ తెలియజేశారు.
తాను కమల్ హాసన్ సర్ బ్యానర్ లో ఒక సినిమా చేయాల్సి ఉందని అయితే ఆ సినిమా నుంచి కూడా తాను తప్పుకుంటున్నానని ఈ సందర్భంగా ఉదయనిధి పేర్కొన్నారు. ప్రస్తుతం ఉదయినిది మారి సెల్వరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న మామన్నన్ సినిమా తన చివరి సినిమా అని ఈ సందర్భంగా ఉదయనిది స్టాలిన్ తెలియజేశారు.ఈ సినిమా పూర్తి అయిన అనంతరం
ఈయన సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఈయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు మరిన్ని బాధ్యతలు పెరగడంతో తాను ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నానని తెలిపారు.