బాడీగార్డ్ కూడా అసభ్యంగా తాకాడు : స్టార్ హీరోయిన్!
- October 25, 2024 / 07:11 PM ISTByFilmy Focus
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ద్వారా బాల నటిగా గుర్తింపు పొందిన అవికా ఘోర్ (Avika Gor) , తెలుగులో ‘ఉయ్యాల జంపాల’ (Uyyala Jampala) సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసి మంచి పాపులారిటీ సంపాదించింది. అయితే సినిమాల్లో తను కోరుకున్నంత క్రేజ్ దక్కకపోవడంతో, మధ్యలో తన లుక్స్ కారణంగా అవకాశాలు కోల్పోతున్నానని భావించి స్లిమ్ అవ్వడానికి నిర్ణయించింది. ఇటీవల బాడీగార్డ్ ప్రవర్తనపై అవికా ఘోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు జాబ్ ఇచ్చిన బాడీగార్డ్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని వెల్లడించింది.
Avika Gor

అతను రెండు సార్లు తనను తాకరాని చోట తాకినట్టు చెప్పింది. మొదటిసారి వార్నింగ్ ఇచ్చినప్పటికీ, అతను మారలేదట. రెండోసారి కూడా అదే ప్రవర్తన కొనసాగించడంతో సీరియస్‌గా హెచ్చరించానని ఆమె చెప్పింది. ‘‘ఇలాంటి వాళ్లను కొట్టే ధైర్యం నాకు లేదు, లేదంటే కొట్టేదాన్ని,’’ అని అవికా ఘోర్ పేర్కొన్నారు. సినిమాల్లో గ్లామర్ తో పాటు మంచి అభినయం ఉన్నా కూడా అవికా ఘోర్ కి మంచి అవకాశాలు దొరకడం లేదు.

ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సీరీస్ ల మీద దృష్టి పెట్టిన అవికా, ‘మాన్షన్ 24’ (Mansion 24) , ‘వధువు’(Vadhuvu) వంటి సీరీస్ లలో నటించింది. బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నా, ఎలాంటి మంచి బ్రేక్ అందుకోలేకపోయింది. తన కెరీర్ మళ్లీ గాడిలో పెట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న అవికా, టాలీవుడ్ పై ఎప్పటికీ ప్రత్యేక ప్రేమ చూపిస్తుంది.

‘‘నాకు తొలి ఛాన్స్ ఇచ్చిన ఈ ఇండస్ట్రీ నాకు ఎంతో ప్రత్యేకం,’’ అని ఆమె చెబుతోంది. ప్రస్తుతం కొన్ని కొత్త ప్రాజెక్టుల మీద ఫోకస్ పెడుతూ, వెబ్ సీరీస్ లలోనైనా తనకు కొత్త అవకాశాలు వస్తాయని భావిస్తోంది. మరి ఈ ప్రయత్నాలు ఆమెకు కెరీర్ లో మరో కొత్త బ్రేక్ ఇస్తాయో చూడాలి.












