పాన్ ఇండియా సక్సెస్ అందుకోవాలని చూస్తున్న అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట డిసెంబర్ 6న విడుదల చేయాలనుకున్నప్పటికీ, చివరికి డిసెంబర్ 5న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే డిసెంబర్ నెల సినిమాల హిస్టరీ చూస్తే, ఇప్పటివరకు ఈ నెలలో విడుదలైన ఏ ఒక్క చిత్రం కూడా రూ. 1000 కోట్ల గ్రాస్ వసూలు చేయలేదు.
Pushpa 2
గడచిన సంవత్సరాల్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీస్ అయిన ‘బాహుబలి 2′(Baahubali2) , ‘RRR‘, ‘KGF 2‘, ‘పఠాన్’, ‘జవాన్’ (Jawan) వంటి సినిమాలు భారీగా కలెక్షన్స్ రాబట్టినా, ఇవేవీ డిసెంబర్ లో రిలీజ్ కాలేదు. గతేడాది సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ (Animal) మూవీ కూడా ఈ క్లబ్ లో చేరేందుకు ప్రయత్నించినా, రూ. 900 కోట్ల వద్ద ఆగిపోయింది. ‘పుష్ప 2’ సినిమాపై టాలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బజ్ ఉంది.
ఇది దేశవ్యాప్తంగా రూ. 1000 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ సాధించిందని టాక్. దీంతో బాక్సాఫీస్ వద్ద డిసెంబర్ లో మొదటి 1000 కోట్ల క్లబ్ మూవీగా నిలవాలనే ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ డిసెంబర్ నెలలో ఇప్పటివరకు పెద్ద సినిమాలు తగినంతగా రాణించలేదు కాబట్టి, ఈ సెంటిమెంట్ పుష్పపై కూడా ప్రభావం చూపుతుందా అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ‘పుష్ప 2’ అనేది గతంలో సాధించిన ఫీట్ ను కొనసాగించడంతో పాటు మరింత గొప్ప విజయం సాధించడానికి తగిన అన్ని అంశాలు కలిగి ఉంది. అల్లు అర్జున్ నటన, సుకుమార్ (Sukumar) దర్వకత్వం, దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్, ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ అన్నీ కలిపి ఈ సినిమాను హిట్ చేయడానికి పూర్తిస్థాయిలో సెట్ అవుతున్నాయి. అయితే డిసెంబర్ నెలలో విడుదల కానున్న ఈ చిత్రం, ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.