Jr NTR, Prashanth Neel: నీల్ – ఎన్టీఆర్ సినిమా.. ఆమె ఓ క్లారిటీ ఇచ్చేసింది!
- October 26, 2024 / 09:20 PM ISTByFilmy Focus
‘సప్తసాగరాలు దాటి’ (Sapta Sagaralu Dhaati) సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ప్రస్తుతం పలు భాషల్లో బిజీగా ఉన్నారు. టాలీవుడ్‌లో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo) సినిమాలో నిఖిల్‌కు (Nikhil Siddhartha) జోడీగా నటిస్తున్న ఈ బ్యూటీ, కోలీవుడ్‌లో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) సరసన ఏఆర్ మురుగదాస్ (A.R. Murugadoss) డైరెక్షన్‌లో చేస్తున్న చిత్రం, అలాగే కన్నడలో శివరాజ్ కుమార్ (Shiva Rajkuma) ‘భారతి రంగల్’ మూవీలో కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ (Jr NTR) ప్రధాన పాత్రలో ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కించబోతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘డ్రాగన్’ గురించిన వార్తలు తెరపైకి వచ్చాయి.
Jr NTR, Prashanth Neel:

2025లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌ను తీసుకున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆమె ‘బఘీరా’ మూవీ ద్వారా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో శ్రీమురళీతో కలిసి పనిచేసిన కారణంగా, ఇప్పుడు ‘డ్రాగన్’లో కూడా ఆమెకు అవకాశం ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఈ అంశంపై రుక్మిణి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ‘‘ప్రశాంత్ నీల్ గారు లేదా ఆయన టీమ్ నుండి ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి సంప్రదింపులు నాపై జరగలేదు.

ఒకవేళ అవకాశం వస్తే నేను కచ్చితంగా సైన్ చేస్తాను. కానీ ఇది కేవలం ఒక అందమైన రూమర్ మాత్రమే’’ అని ఆమె స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఎన్టీఆర్ తో కలిసి నటించాలనే ఆసక్తి ఆమె మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ మాఫియా నేపథ్య కథ ‘డ్రాగన్’ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందనుంది. అందువల్ల ప్రముఖ స్టార్ హీరోయిన్‌ని ఎంపిక చేయాలని టీమ్ ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’ షూటింగ్‌లో బిజీగా ఉండగా, ఆ ప్రాజెక్ట్ పూర్తయిన అనంతరం ‘డ్రాగన్’ పై మరిన్ని వివరాలు వెల్లడికావచ్చని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.














