సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఇన్వెస్టర్ మరియు బ్రాండ్ అంబాసిడర్ గా హవా ఫాన్స్

సంవత్సర కాలం క్రితం హవా ఫ్యాన్స్ కంపెనీ ని స్థాపించి నిర్విరామ కృషి తో పోటీ మార్కెట్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనిల్, సంజీవ్ మరియు దివ్య. ఇప్పుడు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తో జతకలిసి మరింత ముందుకు వెళ్తున్నారు. కరోనా లాక్ డౌన్ లో ఇబ్బందులు వచ్చిన హవా ఫాన్స్ కి మంచి గుర్తింపు వచ్చింది. కేవలం 28 వాట్స్ తో నడిచే ఫ్యాన్ 65 % కరెంట్ ను ఆదా చేస్తుంది. అసలు వేడి అనే మాటే ఉండదు ఈ ఫ్యాన్. ఇలాంటి గొప్ప ఫీచర్స్ తో ఉన్న ఫ్యాన్ చూసి సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ గారు హవా ఫాన్స్ కి ఫిదా అయిపోయారు, వెంటనే ఆయన కూడా ఒక ఇన్వెస్టర్ గా హవా ఫాన్స్ టీమ్ తో చేతులు కలిపారు. సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా అనూప్ రూబెన్స్ మరియు హవా ఫాన్స్ యజమానులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

Click Here To Watch NOW

సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ “హవా ఫాన్స్ యజమాని అనిల్ నాకు మంచి మిత్రుడు. సంవత్సర కాలం క్రితం ఈ హవా ఫాన్స్ ని ప్రారంభించాడు. మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ హవా ఫాన్స్ లో చాలా గొప్ప ఫీచర్స్ ఉన్నాయి ఇది ఒక స్మార్ట్ ఫ్యాన్, 65 % కరెంటు ఆదా అవుతుంది. నోయిస్ లెస్ (Noise less), LED, స్మార్ట్ రిమోట్ మరియు రివర్స్ ఫీచర్ (Reverse Feature) ఫ్యాన్ ఇది. నేను మిడిల్ క్లాస్ అబ్బాయిని మన జీవితం లో ఫ్యాన్స్ చాలా ముఖ్యం, ప్రతి ఒక ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది. ఈ హవా ఫ్యాన్ వాళ్ళ కరెంటు ఆదా అవుతుంది, రివర్స్ ఫీచర్ ఉంది . అద్భుతమైన క్వాలిటీ, గొప్ప ఫీచర్స్ తో మార్కెట్ లో లభిస్తుంది. త్వరలో మార్కెట్ లో టాప్ లిస్ట్ మా హవా ఫ్యాన్ పేరు కూడా ఉంటుంది అని ఆశిస్తున్నాను. ప్రస్తుతానికి తెలంగాణ ఆంధ్ర మరియు కర్ణాటక మార్కెట్ లో మా హవా ఫాన్స్ లభిస్తున్నాయి. ఆన్ లైన్ మార్కెట్ లో కూడా లభిస్తుంది. రేటు కూడా చాలా తక్కువ, 4 వేల రూపాయలతో అద్భుతమైన హవా స్మార్ట్ ఫ్యాన్ ని పొందవచ్చు. త్వరలో వేరే రాష్ట్రాలు తమిళనాడు,కేరళ మరియు ఇతర రాష్ట్రంలో లభిస్తుంది. ఈ హవా ఫాన్స్ లో నేను పార్టనర్ గా ఉండటం చాలా సంతోషంగా ఉంది.

అనిల్ గారు మాట్లాడుతూ “మా హవా ఫాన్స్ 4 వేల నుంచి ప్రారంభం అవుతుంది. ప్రస్తుతానికి ఆఫర్స్ ఉన్నాయి. ఆన్లైన్ లో అమెజాన్, ఫిలిప్ కార్ట్ మరియు jio మార్ట్ లో ఉన్నాము. మా ఫ్యాన్స్ లో రివర్స్ ఫీచర్ సరికొత్త ఫీచర్. శీతాకాలం లో ఈ రివర్స్ ఫీచర్ టెక్నాలజీ చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. సరికొత్త రంగుల్లో మా ఫ్యాన్ లభిస్తుంది. మా హవా ఫాన్స్ తెలంగాణ బ్రాండ్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ప్రస్తుతానికి విజయవాడ, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, తెలంగాణ, బెంగళూరు, మైసూరు, కర్ణాటక లో డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నాం. త్వరలో ఇతర ప్రాంతాల్లో విస్తరిస్తాం.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus