సెలబ్రిటీలు తమ పర్సనల్ విషయాలను బయటపెట్టడానికి అంతగా ఇష్టపడరు. కొంత ప్రైవసీ మెయింటైన్ చేయాలని అనుకుంటారు. అయితే పెళ్లి గురించి మాత్రం అందరూ ఓపెన్ గా చెబుతుంటారు. లేదంటే తమ సోషల్ మీడియా ద్వారా హింట్ ఇస్తూ ఉంటారు. అయితే కొంతమంది నటీనటులు మాత్రం సీక్రెట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది బాలీవుడ్లో స్వర భాస్కర్, పరిణితీ చోప్రా వంటి వారు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
నటుడు పద్మ సూర్య కూడా పెళ్లికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మరో స్టార్ సింగర్ ఓ యూట్యూబర్ ను పెళ్లి చేసుకుని పెద్ద షాకిచ్చాడు. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ సింగర్ హన్సరాజ్ రఘువంశీ.. తాజాగా తన చిన్ననాటి స్నేహితురాలు, యూట్యూబర్ అయిన కోమల్ సక్లానీని పెళ్లి చేసుకుని షాకిచ్చాడు. వీరి పెళ్లి హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2017 నుండి వీరిద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారు.
ఈ ఏడాది మార్చి నెలలో నిశ్చితార్థం చేసుకొని..తాజాగా పెళ్లి బంధంతో (Singer) ఒక్కటైనట్టు తెలుస్తుంది. కొద్దిపాటి బంధు మిత్రులు, సన్నిహితులు సమక్షంలో వీరి వివాహం జరిగినట్లు తెలుస్తుంది. ఇక 2019లో వచ్చిన ‘మేరా భోలా హై బండారీ’ అనే పాటతో పాపులర్ అయిన హన్సరాజ్ రఘువంశీ… తర్వాత కూడా పలు భక్తి పాటలతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ‘OMG 2’లో ‘ఉండి ఉండి వాడి’ పాటతో యూట్యూబ్ లో రికార్డులు సృష్టించాడు.