సినీ పరిశ్రమలో ఘోర విషాదం.. ప్రముఖ సింగర్ కన్నుమూత

సినీ పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అయితే తరచూ ఎవరో ఒక సెలబ్రిటీ, లేదా వారి కుటుంబ సభ్యులు మరణించడం మనం చూస్తూనే ఉన్నాం. అనారోగ్య సమస్యలతో కొంతమంది, వయసు మీద పడి కొంతమంది.. రోడ్డు ప్రమాదాల్లో కొంత మంది.. ఇంకొంతమంది అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ పాపులర్ సింగర్ దుండగుల చేతుల్లో హత్యకు గురయ్యారు. దీంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి అని చెప్పవచ్చు.

ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ప్రముఖ గాయని (Singer) హసీబా నూరి హత్యకి గురవ్వడం జరిగింది. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌‌ను స్వాధీన పరచుకున్న అనంతరం హసీబా, పాక్‌లో తలదాచుకుంటూ వచ్చారు. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ గాయనిగా తన కెరీర్‌ను ప్రారంభించారామె.జానపద పాటలతో ఆమె ఎక్కువ పాపులర్ అయ్యారు అనే సంగతి తెలిసిందే. ఆఫ్ఘాన్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు హసీబా. పలు షోలలో కూడా పాల్గొని బిజీ అయ్యారు.

‘మినా’, ‘సబ్జా’, ‘జనమ్’, ‘అల యారం’ వంటి పాటలు ఆమె ఇమేజ్ ను పెంచాయి అని చెప్పుకోవచ్చు. 2021 ఆగస్టు నెలలో ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబాన్లు స్వాధీనపరుచుకున్న తర్వాత.. హసీబా నూరితో సహా ఇతర కళాకారులు పాక్‌లో శరణార్థులుగా ఉంటూ వచ్చారు. పాక్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో కొంతమంది దుండగులు కాల్పులు జరుపగా… అందులో హసీబా మరణించినట్టు స్పష్టమవుతుంది. మరి ఆ కాల్పులు జరిపింది ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus