గత రెండు, మూడు నెలల్లో సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, నిర్మాతలు, సినిమాటోగ్రాఫర్లు, ఫ్యాషన్ డిజైనర్లు, లేదా వారి కుటుంబ సభ్యులు ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉండడం ఆందోళన కలిగించే విషయం. అనారోగ్యంతో కొంత మంది గుండెపోటుతో కొంతమంది, ఆత్మహత్య చేసుకుని కొంతమంది మరికొంతమంది వృద్ధ వయసులో ఇలా మరణిస్తూనే ఉన్నారు. తాజాగా సినీ పరిశ్రమకు చెందిన మరో సెలబ్రిటీ మరణించడం అందరికీ షాకిచ్చే విషయం. ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్ కన్నుమూశాడు.
ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే..ఇండియన్ సింగర్ నిర్వేయర్.. తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. పంజాబీ సింగర్ అయిన నిర్వేయర్ సింగ్ అనేక హిందీ చిత్రాల్లో పాటలు పాడి పాపులర్ అయ్యాడు. కొన్ని కారణాల వల్ల ఇతను కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. సరిగ్గా 9 ఏళ్ళ క్రితం ఇతను ఆస్ట్రేలియా వచ్చాడు. ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ ప్రశాంత కరమైన జీవితం కొనసాగిస్తున్నాడు.
రోజూలాగే ఈరోజు కూడా నిర్వేయర్ ఆఫీస్ కు బయల్దేరాడు. అయితే అతను ప్రయాణిస్తున్న వాహనం హైవేకు వెళ్తుండగా మూడు వాహనాలు ఢీకొనడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.దీంతో అతను మరణించినట్టు పోలీసులు తెలిపారు. మెల్ బోర్న్ లో ఉన్న నార్తవెస్ట్ ప్రాంతంలో ఆగష్టు 30న ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన తర్వాత నిర్వేయర్ ను హస్పిటల్ కి తరలిస్తుండగా అతను మరణించాడని తెలుస్తుంది.
Most Recommended Video
‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!