రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వాల్సిందే. కానీ సినిమా షూటింగ్ దశలో ఉండగానే బయటకు వస్తున్న బిజినెస్ లెక్కలు చూస్తుంటే ట్రేడ్ పండితుల మైండ్ బ్లాక్ అవుతోంది. సాధారణంగా నిర్మాతలు ఓటీటీ సంస్థల చుట్టూ తిరుగుతుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, ‘వారణాసి’ (SSMB29) కోసం కనీవినీ ఎరుగని ఆఫర్ ఇచ్చిందట. అంత పెద్ద మొత్తాన్ని చూసి ఎవరైనా వెంటనే సంతకం పెట్టేస్తారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
NETFLIX
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ హక్కుల కోసం ఏకంగా రూ. 650 కోట్లు ఆఫర్ చేసిందట. ఇప్పటివరకు ఇండియన్ సినిమా చరిత్రలో ‘కల్కి’ (రూ. 375 కోట్లు), ‘కేజీఎఫ్ 2’ (రూ. 320 కోట్లు), ‘ఆర్ఆర్ఆర్’ (రూ. 300 కోట్లు) మాత్రమే టాప్ ప్లేస్ లో ఉన్నాయి. వాటికి దాదాపు డబుల్ రేటును నెట్‌ఫ్లిక్స్ కోట్ చేసింది. అయినా సరే, తమ సినిమా రేంజ్ ఇంకా ఎక్కువని, ఆ మొత్తం సరిపోదని నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నారట.
దీనిని బట్టి జక్కన్న కాన్ఫిడెన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మహేష్ బాబు స్టామినాకు, రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ తోడైతే స్కై ఈజ్ ద లిమిట్. పైగా ఇందులో ప్రియాంక చోప్రా వంటి గ్లోబల్ స్టార్ హీరోయిన్. ఇదొక గ్లోబల్ అడ్వెంచర్ కాబట్టి, ఇంటర్నేషనల్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఇంకా పెద్ద డీల్ కోసం టీమ్ వెయిట్ చేస్తోంది. కేవలం ఓటీటీ నుంచే భారీ మొత్తం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
నిజానికి సినిమా షూటింగ్ సగం కూడా ఫినిష్ కాకముందే ఈ రేంజ్ ఆఫర్ రావడం సామాన్య విషయం కాదు. ఒకవేళ మరిన్ని అప్డేట్స్ వదిలితే ఈ రేటు ఇంకా పెరుగుతుందని నిర్మాతల ఆలోచన. తొందరపడి డీల్ క్లోజ్ చేయడం కంటే, సరైన సమయం కోసం వేచి చూస్తే ఇంకా ఎక్కువ ఆఫర్స్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనేది వారి ధీమా.