సుకుమార్ చెప్పేవరకు బుచ్చిబాబు ఆగాల్సిందేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సుకుమార్ డైరెక్షన్ లో సినిమా అంటే ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు ఉంటున్నాయో సుకుమార్ శిష్యుల సినిమాలు అంటే కూడా అదే స్థాయిలో అంచనాలు ఏర్పడుతున్నాయి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో తెరకెక్కి గత నెలలో విడుదలైన ఉప్పెన సినిమా భారీగా కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే మిడిల్ రేంజ్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఉప్పెన తర్వాత సినిమాలకు వైష్ణవ్ తేజ్ 5 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. వైష్ణవ్ తేజ్ కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు కూడా వెలువడుతున్నాయి.

అయితే ఉప్పెన డైరెక్టర్ తరువాత సినిమా ఎవరి దర్శకత్వంలో అనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. ఇండస్ట్రీ వర్గాల్లో సుకుమార్ బుచ్చిబాబు తర్వాత సినిమాను సెట్ చేస్తారని అప్పటివరకు ఆయన ఖాళీగానే ఉండాలని ప్రచారం జరుగుతోంది. ఉప్పెనతో అంచనాలను మించి విజయం సాధించిన బుచ్చిబాబు తన కొత్త ప్రాజెక్ట్ ను త్వరగా ప్రకటిస్తే మంచిది. హీరోలు, నిర్మాతలు బుచ్చిబాబుతో సినిమాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నా సుకుమార్ ఫైనల్ చేస్తే మాత్రమే బుచ్చిబాబు తరువాత సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది.

బుచ్చిబాబు మరికొన్ని నెలలు ఖాళీగా ఉంటారో లేక కొత్త సినిమాను ప్రకటిస్తారో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ కుమారి 21 ఎఫ్ సినిమాతో హిట్ కొట్టినా తరువాత సినిమా కోసం ఐదు సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది. ప్రస్తుతం పల్నాటి సూర్యప్రతాప్ ప్రస్తుతం 18 పేజెస్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మరి బుచ్చిబాబు కూడా పల్నాటి సూర్యప్రతాప్ లా తరువాత ప్రాజెక్ట్ ను ఆలస్యంగా ప్రకటిస్తారో లేక వెంటనే ప్రకటిస్తారో చూడాల్సి ఉంది.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus