ఆస్కార్.. ఈ గౌరవం పొందాలని ప్రపంచంలో ప్రతి ఒక్క సినిమా మనిషి కోరుకుంటారు. ఆస్కార్ అవార్డు (Oscar Awards) దక్కితే చాలు అని అందరూ, కనీసం అందులో నామినేట్ అయినా చాలు అని కొందరు, ఆ వేదిక దగ్గర ఉంటే చాలు అని మరికొందరు అనుకుంటారు. అంతటి గొప్ప ఆస్కార్ అవార్డు పోస్టర్ మీద హీరో ఫొటో పడింది అంటే ఎంత పెద్ద విషయం చెప్పండి. హాలీవుడ్ హీరోలకు ఇది రెగ్యులర్ విషయం కావొచ్చేమో కానీ.. మన తెలుగు హీరోలకు చాలా పెద్ద విషయమే.
ఎందుకంటే ప్రపంచ స్థాయి సినిమా అంటే చాలా ఏళ్ల పాటు మన పేరు పెద్దగా వినిపించింది లేదు. కానీ ‘ఆర్ఆర్‌ఆర్’ (RRR) పుణ్యమా అని మన తెలుగు సినిమా పేరు ప్రపంచస్థాయి వేదికల మీద భారీగానే వినిపించింది. ఇప్పుడు ఆ సినిమాలోని ఓ సీన్ ఆస్కార్ పోస్టర్ మీద ఉంచారు. ఆస్కార్ అవార్డ్స్‌లో కొత్తగా స్టంట్ డిజైన్ అనే కేటగిరీని తీసుకొచ్చారు. దానిని అనౌన్స్ చేస్తూ టీమ్ ఓ పోస్టర్ విడుదల చేసింది.
దాని మీదే మూడు సినిమాల్లోని మెయిల్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ‘ఆర్‌ఆర్‌ఆర్’లోనిది. సినిమ ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో పులిని ఓ నిప్పులకొలిమి లాంటి వస్తువుతో చరణ్ (Ram Charan) కొడతాడు చూడండి.. ఆ సీన్‌నే ఇప్పుడు పోస్టర్ మీద పెట్టింది. దాంతోపాటు హాలీవుడ్ చిత్రాలు ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్’, ‘మిషన్ ఇంపాజిబుల్’ స్టంట్స్ పోస్టర్స్ కూడా ఉన్నాయి.
ఈ ముగ్గురినీ ఒకే ప ఇది చూసిన చరణ్ ఫ్యాన్స్ మంచి ఆనందంగా ఉన్నారు. ఇక అవార్డు సంగగి చూస్తే.. 2027లో విడుదలయ్యే సినిమాల నుండి స్టార్ట్ చేస్తున్నారు. అంటే 2028లో తొలి అవార్డు వస్తుందన్నమాట. అంటే ఆస్కార్ (Oscar Awards) 100వ సంవత్సరం నుండి ఈ అవార్డులు వస్తాయన్నమాట.