Sukumar: పుష్ప2 మూవీ సీక్రెట్స్ రివీల్ చేసిన సుకుమార్!

పుష్ప ది రైజ్ సక్సెస్ తో పుష్ప ది రూల్ మూవీ బడ్జెట్ ఏకంగా 400 కోట్ల రూపాయలుగా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ మొత్తంలో సగం బడ్జెట్ ను రెమ్యునరేషన్ల కోసమే ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. పుష్ప ది రైజ్ సక్సెస్ తో దర్శకునిగా సుకుమార్ రేంజ్ కూడా పెరిగింది. పుష్ప ది రైజ్ కథ, కథనం విషయంలో వచ్చిన నెగిటివ్ కామెంట్లను దృష్టిలో ఉంచుకుని సుకుమార్ పుష్ప ది రూల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని సమాచారం అందుతోంది.

తగ్గేదేలే అనే ఒకే ఒక్క డైలాగ్ పుష్ప ది రైజ్ సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది. పుష్ప ది రైజ్ పాన్ ఇండియా హిట్ గా నిలిచిన నేపథ్యంలో పుష్ప ది రూల్ సినిమాతో అంతకు మించిన విజయాన్ని సొంతం చేసుకోవాలని సుకుమార్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది. పుష్ప ది రూల్ గురించి సుకుమార్ మాట్లాడుతూ బాహుబలి, కేజీఎఫ్2 సినిమాలలో హీరో విలన్ మధ్య వార్ ను మరో లెవెల్ లో చూపించారని పుష్ప2 విషయంలో తాను కూడా అదే సూత్రాన్ని ఫాలో అవుతున్నానని అన్నారు.

బన్నీ ఫహద్ ఫాజిల్ మధ్య గేమ్ సీన్ పుష్ప ది రూల్ కు హైలెట్ గా నిలుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. పుష్ప2 మరింత ఇంప్రెసివ్ గా ఉండటంతో పాటు కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉంటాయని సుకుమార్ కామెంట్లు చేశారు. పుష్ప ది రూల్ ను జులై నుంచి స్టార్ట్ చేస్తామని సుకుమార్ చెప్పినట్టు సమాచారం. మారేడుమల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరగనుందని బోగట్టా.

2023 సంవత్సరం జనవరి నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తికానుందని సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. వేసవిలో గ్రాండ్ గా భారీ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. పుష్ప ది రూల్ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించనున్నారని తెలుస్తోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Share.