Sukumar, AlluArjun: బన్నీ క్రేజ్ పై సుకుమార్ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన సుకుమార్ తెరకెక్కించిన పుష్ప ది రైజ్ నెగిటివ్ టాక్ తో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది. తాజాగా సుకుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప మూవీకి దక్కుతున్న ఆదరణ సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. బాలీవుడ్ లో భారీస్థాయిలో ప్రమోషన్స్ చేయకపోయినా ఈ సినిమాకు తొలిరోజే 4 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయని సుకుమార్ చెప్పుకొచ్చారు. బన్నీకి హిందీలో ఉండే క్రేజ్ వల్లే ఈ ఫీట్ సాధ్యమైందని సుకుమార్ కామెంట్లు చేశారు.

కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేశామని సుకుమార్ చెప్పుకొచ్చారు. ఆర్య సినిమా షూటింగ్ సమయంలోనే బన్నీని పుష్పలాంటి పవర్ ఫుల్ రోల్ లో చూపించాలని అనుకున్నానని సుకుమార్ పేర్కొన్నారు. ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ అయితే ఈ సినిమాకు సరిగ్గా సరిపోతుందని అనుకున్నానని సుకుమార్ చెప్పుకొచ్చారు. సినిమాలో ఎర్రచందనం లారీ లోడును బావిలో పడేసే సీన్ రియల్ గా జరిగిందని సుకుమార్ వెల్లడించారు.

కేజీఎఫ్ సినిమాకు పుష్ప సినిమాకు పోలిక పెట్టడం సరికాదని పుష్ప ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని ఈ సినిమాను మరో సినిమాతో పోల్చలేమని సుకుమార్ కామెంట్లు చేశారు. ఆర్య 3 సినిమా చేయాలనే ఆలోచన ఉందని అయితే టైటిల్ మాత్రం మారుస్తానని సుకుమార్ తెలిపారు. పుష్ప2 సినిమా పూర్తైన వెంటనే విజయ్ దేవరకొండ సినిమాను మొదలుపెడతానని మరికొన్ని కథలు సిద్ధం చేసుకున్నానని సుకుమార్ తెలిపారు. మహేష్ కు చెప్పిన కథ పుష్ప కథ సేమ్ కాదని అయితే నేపథ్యాలు మాత్రం ఒకటే అని సుకుమార్ అన్నారు.

పుష్ప పార్ట్ 2తో తాను మంచి మెసేజ్ ఇవ్వనున్నానని సుకుమార్ తెలిపారు. డైరెక్షన్ అనేది ఎమోషనల్ జర్నీ అని సుకుమార్ వెల్లడించారు. ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వస్తుండగా సోమవారం నుంచి ఈ సినిమా సాధించే కలెక్షన్లను బట్టి ఈ సినిమా రిజల్ట్ పై అంచనాకు రావచ్చు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus