Sukumar, Balakrishna: సుకుమార్ ఇంట్లో బాలయ్య ఫోటో.. ఎందుకంటే?

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప ది రైజ్ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నారు. యావరేజ్ టాక్ తో కూడా పుష్ప కమర్షియల్ గా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ లో సుకుమార్ తో పాటు పుష్ప టీమ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ షోలో సుకుమార్ ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఈ షోలో బాలకృష్ణకు తాను ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చానని సుకుమార్ షాకింగ్ కామెంట్లు చేశారు.

తాను చూసిన బాలయ్య సినిమాలు ఎన్నో హిట్టయ్యాయని సుకుమార్ అన్నారు. మా ఊరిలో రెండే వర్గాలు అని ఒకటి బాలయ్య వర్గం అయితే రెండోది చిరంజీవి వర్గమని సుకుమార్ అన్నారు. ఫ్యామిలీలో నలుగురు అన్నాదమ్ముళ్లలో తాను చిన్నవాడినని సుకుమార్ చెప్పుకొచ్చారు. ఇంట్లో పెద్దన్నయ్య బాలయ్య ఫ్యాన్ అని మిగిలిన ఇద్దరు అన్నయ్యలు చిరంజీవి ఫ్యాన్స్ అని సుకుమార్ తెలిపారు. ఇంట్లో ఒకవైపు చిరంజీవి ఫోటో మరోవైపు బాలయ్య ఫోటో ఉంటుందని సుకుమార్ తెలిపారు.

బాలయ్య, చిరంజీవి సినిమాలలో ఎవరి సినిమా విడుదలైనా ఇంట్లో గొడవ జరుగుతుందని సుకుమార్ చెప్పుకొచ్చారు. మా పెద్దన్నయ్య మిమ్మల్ని కలిశాడంటే చాలా సంతోషంగా ఫీలవుతాడని సుకుమార్ అన్నారు. నా తరపున పెద్దన్నయ్యకు ఐలవ్యూ చెప్పాలని సుకుమార్ బాలయ్యను కోరారు. తాను చూసిన బాలయ్య సినిమాలు హిట్స్ అని సుకుమార్ చెప్పడంతో ఫ్లాప్ మాటేమిటని బాలయ్య అడగగా సుకుమార్ మౌనం వహించారు. ఆ తర్వాత బాలయ్య తనతో సినిమా చేయకుండానే సుకుమార్ సూపర్ హిట్లు ఇచ్చారని

సుకుమార్ తెలివితేటలను అభిమానులు చూసి నేర్చుకోవాలని చెప్పుకొచ్చారు. బాలయ్యను చూస్తూ పెరిగానని సుకుమార్ అన్నారు. సుకుమార్ బాలయ్యపై ఉన్న అభిమానాన్ని తన మాటల ద్వారా ఈ షోలో ప్రదర్శించారు. ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ షోకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. బాలయ్య తన హోస్టింగ్ తో అదరగొడుతున్నారు. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో బాలయ్య పుష్ప సినిమా డైలాగ్స్ చెప్పి అలరించారు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus