‘పుష్ప’రాజ్ మేనియా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2: The Rule)ఇటీవల ఓటీటీలోకి వచ్చిన తర్వాత వరల్డ్ ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. తొలి పార్ట్ ‘పుష్ప: ది రైజ్’ (Pushpa) కూడా ఓ స్థాయిలో ప్రపంచ వ్యాప్త ప్రేక్షకుల్ని అలరించింది. ఆ ఎఫెక్ట్ గురించి ప్రముఖ నటుడు సునీల్ చెప్పారు. ‘పుష్ప: ది రూల్’ సినిమా థ్యాంక్స్ మీట్ ఇటీవల జరిగింది. ఆ వేదిక మీద సునీల్ (Sunil) చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
‘పుష్ప’ సినిమా కారణంగా తనకు చాలా గుర్తింపు వచ్చిందని చెప్పిన సునీల్ (Sunil).. స్పెయిన్‌లో ఇటీవల తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పాడు. పాకిస్థానీయులు కూడా తనని అభిమానిస్తున్నారని చెప్పారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్లానని చెప్పిన సునీల్.. అక్కడ రాత్రి 10 గంటలకు రెస్టరంట్లు మూసేస్తారని, తమ బృందం 9.45 గంటల సమయంలో స్నాక్స్ కోసం స్టోర్‌లో అడిగామని కానీ వాళ్ల దగ్గర దొరకలేదు అని చెప్పారు.
ఆ తర్వాత ఇంకా ఏమైనా రెస్టరంట్లు ఉన్నాయా అని అడిగితే.. ‘కబాబ్ పాయింట్’ అనే ఒక చిన్న హోటల్ కనిపించిందట. పేరు చూసి ఇండియన్ ఫుడ్ ఉండొచ్చని అక్కడికి వెళ్లారట. అప్పటికే అర్ధరాత్రి రెండున్నర అయిందట. కారు దిగగానే ఒక వ్యక్తి తనను చూస్తూ ఉన్నాడట. ఫోన్‌లో ‘పుష్ప’ ఇంటర్వెల్ సీన్ చూపించి.. ఇది నువ్వే కదా అని అడిగాడట. ఆ తర్వాత మొత్తం టీమ్‌కి వండిపెట్టారట. తమ సినిమా విదేశాల్లోనూ చేరిందనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు సునీల్.
ఇప్పుడు తనకు తమిళ, కన్నడ, మలయాళంలో మంచి పాత్రలు ఇస్తున్నారని.. ఇదంతా ‘పుష్ప’ సినిమా ఇచ్చిన పునర్జన్మ అని సునీల్ చెప్పారు. తానొక లోకల్ ప్రొడక్ట్‌ని అని, దానికి ముద్ర వేసి ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ చేశారు అని సునీల్ ఆనందంగా చెప్పుకొచ్చారు. ఆ సినిమా రీచే కాదు తెలుగు సినిమా రీచ్ కూడా పెరిగింది అనడానికి సునీల్ చెప్పిన విషయం ఒక ఉదాహరణ.
నాకు తెలుగులోనే కాదు తమిళ్, కన్నడ భాషల్లో కూడా ఆఫర్లు రావడానికి కారణం ‘పుష్ప’#Sunil #Sukumar #AlluArjun #Pushpa pic.twitter.com/Gmw4Q23VLg
— Filmy Focus (@FilmyFocus) February 8, 2025