ప్రిన్స్ మహేష్ బాబు తండ్రి అయిన సూపర్ స్టార్ కృష్ణ గారు అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయన్ని హైదరాబాద్ లో ఉన్న కాంటినెంటల్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు కుటుంబ సభ్యులు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.అందుతున్న సమాచారం ప్రకారం ఈయన శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈరోజు పరిస్థితి విషమించడంతో వెంటనే సిబ్బంది అలాగే కుటుంబ సభ్యులు ఆయన్ని హాస్పిటల్ లో చేర్చినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఆయనకి చికిత్స నిర్వహిస్తున్నారు వైద్యులు. ఆయన్ని అబ్జర్వేషన్ లో ఉంచి విషయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. కాగా కృష్ణ గారి వయసు కూడా 80 సంవత్సరాలు కావడంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. ఈ మధ్యనే ఆయన సతీమణి ఇందిరా దేవి గారు మరణించిన సంగతి తెలిసిందే. తెనాలి కి చెందిన కృష్ణ గారి పూర్తి పేరు ఘట్టమనేని శివ రామ కృష్ణ. 1942 వ సంవత్సరం మే 31న ఆయన జన్మించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి స్టార్లుగా దూసుకుపోతున్న తరుణంలో కృష్ణ గారు మాస్ సినిమాలతో ప్రేక్షకులను అలరించి తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుని స్టార్ హీరోగా ఎదిగారు.
హీరోగానే కాకుండా నిర్మాతగా దర్శకుడిగా కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను రూపొందించారు. తన సహనటి, దర్శకురాలు అయిన విజయ నిర్మల ని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నారు కృష్ణ. విజయ నిర్మల గారు 2019 లో అనారోగ్య సమస్యలతో మరణించారు. ఇక ఈ మధ్యనే ఇందిర గారు కూడా చనిపోవడంతో ఆయన ఒంటరితనానికి గురై మానసికంగా కృంగిపోతున్నట్టు తెలుస్తుంది.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!