కరోనా ఇప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ వణికిస్తోంది. దీనికి పూర్తిగా పరిష్కారం దొరకనప్పటికీ.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఇక ఈ ఎఫెక్ట్ టాలీవుడ్ పై కూడా గట్టిగానే పడింది. ఇప్పటికే మాల్స్, స్కూల్స్, థియేటర్లు .. ఈ నెలాఖరు వరకూ మూసేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక కొన్ని చిత్రాల షూటింగ్ లను క్యాన్సిల్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. దీనికి టాలీవుడ్ పెద్దలు అలాగే నిర్మాతలందరూ ఏకీభవిస్తున్నట్టు తెలియజేసారు. ఈ క్రమంలో సురేష్ బాబు చేసిన కామెంట్స్ మాత్రం పెద్ద చర్చకు దారి తీశాయి.
సురేష్ బాబు మాట్లాడుతూ… “తెలంగాణ ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇప్పుడు థియేటర్లను మూసివేయడం అలాగే షూటింగ్ లను నిలిపివేయడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న మాట నిజమే.! అయితే ఈ 15 రోజులు థియేటర్లు రన్ కాకపోయినా…రెంట్లు కట్టాల్సిందే. అంతేకాదు కూల్ డ్రింక్స్ వ్యాపారులు, అలాగే క్యూబ్ వంటి డిజిటల్ ఆపరేటర్లు సైతం ఖాళీగా ఉండాలి.. దీని వల్ల ఆర్థికంగా ఇబ్బంది తప్పదు. అలా అని వాళ్ళు నష్టపోకుండా ఉండడానికి…ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేము కదా…! కొన్నాళ్ళు ఇది చేయక తప్పదు” అంటూ ఇష్టం లేనట్టుగా ఆయన స్పందించినట్టుగా తెలుస్తుంది.