సినిమా ఇండస్ట్రీని కరోనా ఒక్కసారిగా కుదిపి వేసిందని చెప్పాలి. కరోనా వ్యాప్తి చెందడంతో సినీ పరిశ్రమపై కోలుకోలేని దెబ్బ పడింది. కరోనా వ్యాప్తి చెందటం వల్ల ఒక్కసారిగా థియేటర్ లు మూతపడటమే కాకుండా థియేటర్లు మూతపడటంతో ఓటీటీల ఆదరణ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఇంటిల్లిపాది ఇంటిలో కూర్చుని ఎంతో సంతోషంగా ఓటీటీలలో సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారు. ఈ విధంగా ఓటీటీలకు అలవాటు పడిన ప్రేక్షకులు థియేటర్లు తెరుచుకొని యధావిధిగా థియేటర్లో రన్ అవుతున్నప్పటికీ థియేటర్లకు రాలేని పరిస్థితి ఏర్పడింది.
ఒకవైపు సినిమా టికెట్ల రేట్లు పెంచడంతో సామాన్యులకు కుటుంబంతో కలిసి సినిమా చూసే పరిస్థితులు కూడా లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే థియేటర్లకు వెళ్లి వేలు వేలు ఖర్చు పెట్టుకోలేనివారు కేవలం అతి తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది ఓటీటీలలో సినిమా చూడటానికి ఇష్టపడుతున్నారు. దీంతో థియేటర్లకు వచ్చే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోవడంతో ఏకంగా కొందరు థియేటర్లను అమ్మకానికి కూడా పెడుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దగ్గుబాటి సురేష్ బాబు విశాఖ నగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి జ్యోతి థియేటర్ అమ్మేసినట్టు తెలుస్తుంది.
విశాఖ నగరంలో సెంటర్లో ఉన్నటువంటి ఈ థియేటర్ విశాఖ నగరంలో ఉన్నటువంటి ఓ ప్రముఖ వ్యాపారులకు అమ్మినట్టు తెలుస్తుంది.కరోనా తర్వాత థియేటర్లకు ఆదరణ తగ్గటం వల్లే డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నటువంటి ఈయన తన థియేటర్ అమ్మడం చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా తన థియేటర్ అమ్మేసి ఆ స్థానంలో 10 అంతస్తుల బిల్డింగ్ కట్టడం కోసమే పలువురు వ్యాపారులు ఈయన దగ్గర నుంచి థియేటర్ భారీ ధరకు కొనుగోలు చేశారని వార్తలు వస్తున్నాయి.
అయితే ఇప్పటికే ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డీల్స్ పూర్తి అయ్యాయని తెలుస్తోంది. అయితే ఈయన ఈ థియేటర్ అమ్మడం వెనుక ఉన్న కారణం ఏంటి అనే విషయం తెలియాలంటే ఈ వార్తలపై సురేష్ బాబు స్పందించాల్సి ఉంది.