Unstoppable with NBK: బాలయ్య షో విషయంలో ఆ విధంగా ప్లాన్ చేశారా?

స్టార్ హీరో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో పవన్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ పదో ఎపిసోడ్ గా ప్రసారం కానుందని సమాచారం. ఈ వారం ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ షోకు అతిథులుగా సూర్య, కార్తీ హాజరు కానున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సూర్య, కార్తీలకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ఈ ఇద్దరు హీరోలు తెలుగులో పాపులారిటీ, మార్కెట్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

బాలయ్య షోకు సూర్య, కార్తీ హాజరై తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలతో పాటు సినీ జీవితానికి సంబంధించిన విశేషాలను కూడా పంచుకుంటే బాగుంటుందని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. బాలయ్య షో అయిన అన్ స్టాపబుల్ సీజన్2 కు క్రేజ్ ఉన్న గెస్టులే హజరు కావడం గమనార్హం. సూర్య, కార్తీ తెలుగులో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. ఈ ఇద్దరు హీరోలు భిన్నమైన కథలను ఎంచుకుంటూ ఇతర హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

సూర్య నటించిన పలు సినిమాలు ఓటీటీలో విడుదలై అంచనాలకు మించిన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సూర్య, కార్తీ స్ట్రెయిట్ తెలుగు సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు బాలయ్య ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీపై చేసిన వివాదాస్పద కామెంట్ ద్వారా వార్తల్లో నిలిచారు. బాలయ్య ఈ కామెంట్ల గురించి స్పందించకపోవడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అన్ స్టాపబుల్ షో మాత్రం ప్రేక్షకుల నుంచి అంచనాలకు మించి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. బాలయ్య కెరీర్ లో ఈ షో స్పెషల్ షోగా నిలిచింది. అన్ స్టాపబుల్ షో సక్సెస్ తో బాలయ్య పారితోషికం కూడా ఊహించని స్థాయిలో పెరిగిందని తెలుస్తోంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus