Swetaa Remuneration: శ్వేత వర్మ.. కి ‘బిగ్ బాస్’ ఇచ్చింది అంతేనా..!

‘ది రోజ్ విల్లా’ ‘పచ్చీస్’, ‘ముగ్గురు మొనగాళ్లు’ ‘సైకిల్’… వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది శ్వేత వర్మ. వీటితో పాటు పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. కానీ అవి ఈమెకు ఆశించన స్థాయిలో గుర్తింపుని తీసుకురాలేదు. అయితే ‘బిగ్‏బాస్5’ లో ఆఫర్ రావడానికి మాత్రం ఆమెకు కలిసొచ్చాయని చెప్పొచ్చు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేప్పుడు శ్వేత గురించి జనాలకి పెద్దగా తెలీదు. కానీ ఆమె ముక్కుసూటి స్వభావానికి, గేమ్ ఆడిన తీరుకి అంతా ఆకర్షితులయ్యారు.

ఇతరుల చేసే తప్పుల్ని సైతం ఈమె భయపడకుండా మొహం పైనే చెప్పేస్తూ ఉంటుంది.స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న శ్వేత నిన్న ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యింది. దీంతో ఆమె గేమ్ ను ఇష్టపడేవారు కొంత నిరుత్సాహం చెందారనే చెప్పాలి.ఒకవేళ వైల్డ్ కార్డు ఎంట్రీ అనేది ఏమైనా ఉంటే..హౌస్ నుండీ ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరైనా తిరిగి హౌస్ లోకి వెళ్ళే ప్రాసెస్ లాంటిది బిగ్ బాస్ ఏమైనా ఈ సీజన్లో పెడితే శ్వేతానే వెళ్ళాలని అంతా అనుకుంటున్నారు.

సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే … 6 వారాల పాటు హౌస్ లో కొనసాగినందుకు గాను శ్వేతకి ఏమాత్రం పారితోషికం ఇచ్చి ఉంటారు అనే అనుమానం అందరిలోనూ నెలకొంది. అందుతున్న సమాచారం ప్రకారం.. శ్వేతకి ఒక్కో వారానికి గాను రూ.90 వేల వరకు ఇచ్చారని తెలుస్తుంది. అంటే దాదాపు రూ.5 లక్షల వరకు ఆమెకి పారితోషికం అందిందన్న మాట.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Share.